Pawan Kalyan: పుష్ప 2 కలెక్షన్ల పై సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్.. దానివల్లే ఇదంతా సాధ్యమైంది అంటూ!

Pawan Kalyan: టాలీవుడ్ హీరో, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా అల్లు అర్జున్ వ్యవహారాలపై స్పందించిన విషయం తెలిసిందే. ఇంత వివాదం జరుగుతున్న పవన్ కళ్యాణ్ స్పందించలేదు అంటూ మొదటి వరకు సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. ఎట్టకేలకు ఈ వివాదాలన్నింటి పై స్పందించారు పవన్ కళ్యాణ్. తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. సీఎం రేవంత్ రెడ్డి చేసింది కరెక్టే, ఆ స్థానంలో ఉన్నప్పుడు ఎవరైనా అలాగే రియాక్ట్ అవుతారు. పొజిషన్ రెండు వైపులా పదును ఉన్న కత్తి లాంటిది.

పేరు మర్చిపోవడం వల్లే ఇలా చేశారన్నది నిజం కాదు. ఆయన దాని దాటి వచ్చారు. అలా ఎవరూ ఆలోచించరు అని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. అనంతరం అల్లు అర్జున్ గురించి స్పందిస్తూ.. ఇన్సిడెంట్ జరిగిన వెంటనే బాధ్యత ఫ్యామిలీని పరామర్శించి భరోసా ఇవ్వాల్సింది. వారి బాధను పంచుకోవాల్సిందే. గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చుకున్నారు అని అన్నారు. అనంతరం పుష్ప టు సినిమాకు వచ్చిన కలెక్షన్ల పై స్పందిస్తూ.. రేవంత్‌ రెడ్డి సర్కార్‌ కూడా పుష్ప 2 సినిమాకి ఎంతో చేసింది. బెనిఫిట్‌ షోస్‌ కి పర్మిషన్‌ ఇచ్చారు, హైయ్యెస్ట్ టికెట్‌ రేట్లు పెంచారని తెలిపారు.

పుష్ప 2 సినిమా కలెక్షన్లలో రికార్డులు బ్రేక్‌ చేస్తుందని ఒక రిపోర్టర్‌ చెప్పినప్పుడు టికెట్‌ రేట్లు పెంచడం వల్లే సాధ్యమైందని, టికెట్‌ రేట్లు పెంచితేనే రికార్డులు బ్రేక్‌ అవుతాయని, పెంచకపోతే అన్ని కలెక్షన్లు ఎలా వస్తాయని తెలిపారు. జరిగిన ఘటనని మానవతాదృక్పథంతో చూడాల్సిన అవసరం ఉందని, ఆ లోటు కనిపిస్తుందన్నారు పవన్‌. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇకపోతే పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే.. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో యాక్టివ్ గా పాల్గొంటూ తన బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇలా రెండు పడవల ప్రయాణం చేస్తూ క్షణం కూడా తిరిగి లేకుండా గడుపుతున్నారు పవన్ కళ్యాణ్.