పవన్ కళ్యాణ్ రాజకీయం అనే మురికి కూపంలో చిక్కుకున్నాడు… చిరు కామెంట్స్ వైరల్!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిరంజీవి ఎన్నో ఇంటర్వ్యూలలో హాజరవుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.ఈ క్రమంలోనే చిరంజీవి పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి 2008వ సంవత్సరంలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన అనంతరం 2009 ఎన్నికలలో పోటీ చేసి అనంతరం తనకు రాజకీయాలు సెట్ అవ్వని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం జనసేన పార్టీని స్థాపించి ప్రజల సంక్షేమం కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు.

పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం గురించి చిరంజీవి మాట్లాడుతూ పవన్ ప్రజా సంక్షేమం కోసమే రాజకీయాలలోకి వచ్చాడని తనకు ప్రజాసంక్షేమం తప్ప మరే ధ్యాస లేదని తెలిపారు. సరైన సమయానికి తిండి లేదు సరైన బట్టలు వేసుకోడు.. పవన్ కళ్యాణ్ కు ఇప్పటివరకు సొంత ఇల్లు కూడా లేదని ఈయన తెలిపారు.పవన్ కళ్యాణ్ ప్రజా సంక్షేమం కోసం రాజకీయం అనే ఒక మురికి కూపంలోకి దిగారని చిరు తెలిపారు.

ఇలా స్వచ్ఛమైన మనసుతో మురికి శుభ్రం చేసేటప్పుడు కొంత మురికి మనకి కూడా అంటుకుంటుంది. పవన్ కళ్యాణ్ సైతం అలాంటి విమర్శలను ఎదుర్కొంటూ ఉన్నారని ఈయన తెలిపారు.అధికార పార్టీ చేస్తున్న అక్రమాలను పవన్ కళ్యాణ్ ప్రశ్నించడంతో ఎంతోమంది అధికార పార్టీ నేతలు పవన్ కళ్యాణ్ ను తీవ్రస్థాయిలో విమర్శిస్తున్న విషయం మనకు తెలిసిందే ఈ క్రమంలోనే ఈ విషయాలను దృష్టిలో పెట్టుకున్నటువంటి చిరంజీవి ఇలా తన తమ్ముడి పట్ల వస్తున్నటువంటి విమర్శలు గురించి స్పందిస్తూ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.