Rishabh Pant: ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా రిషబ్ పంత్ నిలిచాడు. లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ 27 కోట్ల రూపాయల పలు చేసి అతడిని కొనుగోలు చేసింది. ఈ వేలం ఐపీఎల్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. పంత్ (Rishabh Pant) కోసం ఢిల్లీ క్యాపిటల్స్ సైతం బలంగా పోటీ పడినప్పటికీ, లక్నో చివరికి రికార్డు బిడ్ వేసి తన జట్టులోకి తీసుకుంది.
అయితే పంత్ (Rishabh Pant) ను 27కోట్లకు కొనుగోలు చేసినప్పటికీ పూర్తి స్థాయిలో అతనికి దక్కదు. ట్యాక్స్ కట్ చేసిన తర్వాత ప్రతి సీజన్‌కు పంత్ (Rishabh Pant) లక్నో ఫ్రాంచైజీ నుంచి 18.9 కోట్ల రూపాయలు పొందుతాడు. కేంద్ర ప్రభుత్వం ఆదాయ పన్ను నిబంధనల ప్రకారం, 27 కోట్లలో దాదాపు 8.1 కోట్ల రూపాయలు పన్నుల రూపంలో కట్ చేయబడతాయి. దాంతో అతడికి అందేది 18.9 కోట్లే. ఇది కూడా తక్కువ మొత్తమేమీ కాదు. ఒకవేళ పంత్ గాయం వల్ల టోర్నమెంట్‌కు ముందే వైదొలిగితే, అతడికి జీతం చెల్లించబడదు.
కానీ, టోర్నమెంట్ మధ్యలో గాయం కారణంగా తప్పుకోవాల్సి వస్తే, పూర్తి సీజన్‌కు జీతం చెల్లించాల్సి ఉంటుంది. ఇది బీసీసీఐ, ఫ్రాంచైజీలు పాటించే ప్రధాన నిబంధన. గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరమైనా, బీసీసీఐ బీమా పాలసీ ప్రకారం భారతీయ ఆటగాళ్లు తగిన పరిహారం పొందుతారు. ఒక ఆటగాడు బెంచ్‌కే పరిమితమైనా, కానీ టోర్నమెంట్ మొత్తం అందుబాటులో ఉన్నా, ఫ్రాంచైజీతో చేసుకున్న ఒప్పందం ప్రకారం పూర్తి జీతం చెల్లించబడుతుంది. కానీ వ్యక్తిగత కారణాలతో ఆడకపోతే, ఆడిన మ్యాచ్‌ల సంఖ్య ఆధారంగా మాత్రమే చెల్లింపు ఉంటుంది.