Super Six: కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత మరో మాట మాట్లాడుతూ సూపర్ సిక్స్ హామీలను ఎగ్గొట్టడానికే ప్రయత్నం చేస్తుంది అంటూ ఇప్పటికే విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ అంటూ ప్రజలకు పెద్ద ఎత్తున హామీలను ప్రకటించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ హామీలను పూర్తిగా పక్కన పెట్టేశారు కేవలం పెన్షన్లు హామీలు మాత్రమే ప్రభుత్వం నెరవేర్చిందని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎన్నికలలో భాగంగా ఇచ్చిన హామీలన్నింటిని కూడా నెరవేర్చాలి అంటూ వామపక్షాల నేతృత్వంలో పలువురు నాయకులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు.
ఈ క్రమంలోనే అనంతపురం జిల్లా కలెక్టర్ వద్ద పెద్ద ఎత్తున ఉద్రిక్తత నెలకొంది.సిపిఐ ,సిపిఎం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగినప్పటికీ అక్కడికి రైతులు కార్మికులు ప్రజలు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారట. సూపర్ సిక్స్ హామీలను వెంటనే అమలు చేయాలి అంటూ డిమాండ్ చేశారు అనంతరం కలెక్టర్ వినోద్ కుమార్ కారు ముందట కూడా నిరసనలు తెలియజేస్తూ అడ్డుకున్నారట. దీంతో అనంతపురం కలెక్టర్ వద్ద కాస్త ఉద్రిక్తత చోటు చేసుకుంది.
ముఖ్యంగా రైతు భరోసా కింద రైతులకు 20వేల రూపాయలు చొప్పున ప్రభుత్వం ఇవ్వబోతున్నట్లు ఎన్నికల హామీలలో తెలియజేశారు కానీ ఇప్పటివరకు రైతులకు ఏమాత్రం సహాయం అందికపోవడంతో రైతులకు కూడా పంట కోతల సమయంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు తెలియజేశారు. ఇవాళ విడుదల చేసిన బడ్జెట్లో పెద్దగా పథకాలకు బడ్జెట్ కేటాయించకపోవడం పట్ల కూడా విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే.