IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 వేలంలో అన్ని జట్లూ తమ బలాబలాలను బట్టి ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. అయితే, సన్‌రైజర్స్ హైదరాబాద్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా వెటరన్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ (Bhuvneshwar Kumar)ను వదిలేసి, ఇతర ఆటగాళ్లను తీసుకోవడం తప్పిదమైందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
భువనేశ్వర్ కుమార్ (Bhuvneshwar Kumar) ఐపీఎల్‌లో SRH విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 2014లో ఈ జట్టులో అడుగుపెట్టిన భువీ, బౌలింగ్‌లో తన వేరియేషన్లతో ప్రత్యేకతను చాటుకున్నాడు. 176 మ్యాచుల్లో 181 వికెట్లు తీసి, SRHకి ఎంతో దోహదపడ్డాడు. అయితే, ఈ సీజన్‌లో SRH యాజమాన్యం అతనిపై ఆసక్తి చూపలేదు. వేలంలో భువీని ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ బిట్ చేసినా, చివరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అతడిని రూ.10.75 కోట్లకు దక్కించుకుంది. ఇది RCBకు పెద్ద అడ్వాంటేజ్‌గా మారే అవకాశం ఉంది.
Rishabh Pant: రిషబ్ పంత్ 27 కోట్ల డీల్.. ట్యాక్స్ ఎంత కట్టాలో తెలుసా?
మరోవైపు, SRH అనుభవజ్ఞుడైన జయదేవ్ ఉనద్కట్ (Jaydev Unadkat)ను కేవలం రూ.1 కోట్ల బేస్ ప్రైస్‌కు కొనుగోలు చేసింది. గత సీజన్‌లో SRH తరపున జయదేవ్ (Jaydev Unadkat) 11 మ్యాచుల్లో 8 వికెట్లు మాత్రమే తీశాడు. అతని ఐపీఎల్ రికార్డ్ 105 మ్యాచుల్లో 99 వికెట్లు తీసినదే. కానీ, భువనేశ్వర్‌ను వదిలేసి జయదేవ్ (Jaydev Unadkat)ను తీసుకోవడం సరైన నిర్ణయమా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ చర్య SRH బౌలింగ్ విభాగానికి బలహీనత తీసుకురావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
SRH ఈ సీజన్‌లో కీలక ఆటగాళ్లను రిటైన్ చేసింది. కమిన్స్, క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ వంటి స్టార్ ప్లేయర్లను ముందుగానే కొనసాగించడంతో 75 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. వేలంలో ఇషాన్ కిషన్, షమీ, మహమ్మద్ సిరాజ్, హర్షద్ పటేల్ వంటి ప్లేయర్లను కొనుగోలు చేసి జట్టును బలపరిచింది.
కానీ, షమీతో పాటు భువనేశ్వర్ (Bhuvneshwar Kumar)ను కొనుగోలు చేస్తే జట్టు మరింత బలంగా తయారయ్యేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. తమ బౌలింగ్ విభాగంలో రాహుల్ చాహర్, ఆడమ్ జంపా వంటి ఆటగాళ్లను తీసుకున్న SRH, వాషింగ్టన్ సుందర్‌ను కలుపుకుని ఉంటే ఇంకా సమతుల్యతగా ఉండేదని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి SRH చేసిన ఈ నిర్ణయాలు సీజన్ ప్రారంభం తర్వాత ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.