Nayan-Dhanush: నయనతారకు మరో షాకిచ్చిన ధనుష్.. ఈ వివాదం కొలిక్కి వచ్చేలా లేదుగా?

Nayan-Dhanush: నయనతార, ధనుష్.. గత కొద్ది రోజులుగా ఈ రెండు పేర్లు సోషల్ మీడియాలో మారమోగుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య వివాదం కోలీవుడ్ ఇండస్ట్రీలో అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఇప్పటికే ఇద్దరిపై ఒకరికొకరు ఆరోపణలు చేసుకోవడంతో పాటు సంచలన ట్వీట్ లు కూడా చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పట్లో వీరి వివాదం ముగిసేలా కనిపించడం లేదు. నెమ్మదిగా సద్దుమణుగుతోంది అనుకుంటున్నా క్రమంలో తాజాగా హీరో ధనుష్ నయనతార కు మళ్లీ ఊహించని షాక్ ఇచ్చాడు. అసలేం జరిగిందంటే..

నటి నయనతార, ఆమె భర్త, దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ పై హీరో ధనుష్‌ దావా వేశారు. పర్మిషన్‌ లేకుండా నానుమ్‌ రౌడీ దాన్‌ విజువల్స్‌ ను ‘
నయనతార బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌ డాక్యుమెంటరీలో వాడుకోవడంతో ఆయన నిర్మాణ సంస్థ తాజాగా మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు నయన్‌ దంపతులతో పాటు వారికి చెందిన రౌడీ పిక్చర్స్‌ పై దావా వేసింది. బుధవారం ఈ పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం దీనిపై విచారణకు అంగీకరించింది.

డాక్యుమెంటరీ ట్రైలర్‌లో మూడు సెకన్ల సీన్స్‌ ఉపయోగించినందుకు పరిహారంగా ఆయన రూ.10 కోట్లు డిమాండ్‌ చేశారని తెలిపారు. ఈసందర్భంగా ధనుష్‌ క్యారెక్టర్‌ను తప్పుబట్టారు. తనపై ఆయన ద్వేషం కనబరుస్తున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కోలీవుడ్‌లో ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఆమెకు పలువురు నటీమణులు మద్దతు తెలిపారు. ధనుష్‌కు అభిమానుల సపోర్ట్‌ లభించింది. ఇకపోతే ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ఈ వివాదం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు.