ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగ అభివృద్ధికి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యాచరణ సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. మంగళగిరి క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో పవన్ మాట్లాడుతూ రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని వివిధ మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో చలనచిత్ర పరిశ్రమ కీలక పాత్రను పవన్ కళ్యాణ్ హైలెట్ చేశారు.
ప్రతి సినిమాలోను ఏపీ లొకేషన్ హైలెట్ చేయడం ద్వారా టూరిజాన్ని అభివృద్ధి చేయాలని బలంగా సూచించారు. న్యూజిలాండ్, ఉక్రెయిన్ వంటి దేశాలు సినిమా టూరిజం ద్వారానే అభివృద్ధి చెందాయని, ఆయా దేశాలను స్ఫూర్తిగా తీసుకొని ఏపీలో ఫిలిం టూరిజం ని ప్రోత్సహించాల్సి ఉందని సందేశాన్ని ఇచ్చారు పవన్ కళ్యాణ్. నంద్యాలలోని ఏనుగుల శిబిరాలు, గండికోట కొండలు, హార్స్లీ హిల్స్, కోరింగ మడ అడవులు వంటి ల్యాండ్ మార్కులను ప్రోత్సహించడం వంటి పర్యావరణ టూరిజం కార్యక్రమాలు యువతకు ఉపాధి కల్పించే మార్గాలుగా పవన్ కళ్యాణ్ ఉద్గాటించారు.
ఏదైనా సినిమాలో ఒక సన్నివేశంలో ఏపీలో అందమైన లోకేషన్లను హైలెట్ చేయడం ద్వారా అది పాంప్లెట్ లాగా ప్రచారానికి సహకరిస్తుందని చెప్పుకొచ్చారు. సంబంధిత శాఖల మంత్రులతో ప్రత్యేకంగా సినిమా టూరిజాన్ని అభివృద్ధి చేయాల్సిందిగా పవన్ కోరారు. సినిమా రంగంపై ఆయన చేస్తున్న సూచనలు అద్భుతంగా ఉన్నాయి అంటున్నారు సినీ వర్గం వారు.
అయితే ఏపీలో సినిమా పరిశ్రమ అభివృద్ధికి నిబద్ధతతో కూడుకున్న ప్రణాళికను సినిమా టీవీ రంగ అభివృద్ధి సంస్థ ఇంతవరకు ప్రకటించలేదు. పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అయిన దగ్గర నుంచి సినీ పరిశ్రమకు ఏదో ఒక విధంగా ఫేవర్ చేస్తూనే ఉన్నాడు. ఏపీలో టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అనుమతిని ఇచ్చాడు, అలాగే అదనపు షోలకు పర్మిషన్ పైడ్ ప్రీమియర్స్ కి కూడా అనుమతులు ఇచ్చాడు. అలాంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీలో సినిమా షూటింగ్ లు తీయాలని ఆహ్వానం పలకటం పట్ల సినీ పరిశ్రమ ఎలా స్పందిస్తుందో చూడాలి.