పాపం, ఆ హిట్ సినిమాని మిస్ చేసుకున్నాడంట.. నాగార్జునపై కంప్లైంట్ చేసిన సుమంత్!

అక్కినేని నాగేశ్వరరావు ముద్దుల మనవడు, నాగార్జున మేనల్లుడు అయిన సుమంత్ ప్రేమకథ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పెద్దగా ఆడలేదని చెప్పాలి. ఆ తర్వాత చేసిన సినిమాలు పర్వాలేదు అనిపించుకున్నా సత్యం సినిమా అతనికి మంచి బ్రేక్ ఇచ్చిందని చెప్పాలి. అయితే ఆ తర్వాత మళ్లీ రెండు మూడు నార్మల్ హిట్స్ అందుకున్నా సుమంత్ కి అనుకున్నంత సక్సెస్ రాలేదని చెప్పాలి. కెరియర్ ప్రారంభంలో కథల ఎంపికలో పొరపాట్లు అతని కెరియర్ కి గట్టిదెబ్బె వేసాయి.

నిజానికి దేశముదురు స్టోరీ ముందు సుమంత్ దగ్గరకే వెళ్లిందంట కానీ అతను రిజెక్ట్ చేయడంతో కధ అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళింది. నిజానికి సుమంత్ దేశముదురు సినిమా చేసి ఉంటే అతని కెరియర్ వేరే లెవెల్ లో ఉండేది.కెరియర్ లో బాగా వెనకబడిపోయిన సుమంత్ ఇప్పుడు మళ్ళీ హీరోగా నిలబడే ప్రయత్నాలు చేస్తున్నాడు మధ్యలో కొన్ని సినిమాలలో కీలక పాత్రలు పోషించాడు. వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ తన కెరియర్ నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇందులో భాగంగానే సార్ సినిమాలో కీలక పాత్రలో నటించిన సుమంత్ సీతారామం సినిమాలో కూడా బలమైన పాత్ర పోషించాడు. ఈ మధ్యనే ఆలీ తో సరదాగా గేమ్ షోలో పాల్గొన్న సుమంత్ తన కెరియర్ గురించి, తన ఫస్ట్ కమ్యూనరేషన్ గురించి మాట్లాడుతూ సరదాగా తన మామ నాగార్జున పై కంప్లైంట్ చేశాడు. తన మొదటి సినిమా ప్రేమ కథ. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాని నాగార్జున ప్రొడ్యూస్ చేశాడు.

అయితే ఈ సినిమాకి సుమంత్ పారితోషకం తీసుకోలేదు, సినిమా కూడా ఫ్లాప్ అయింది అయితే ఆ తర్వాత మళ్లీ నాగార్జున నిర్మాతగా కరుణాకరన్ దర్శకత్వం వహించిన సినిమా యువకుడు ఈ సినిమాలో భూమిక హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా యూత్ లో మంచి ఆదరణ పొందింది. మొదటిసారిగా సుమంత్ కి నాగార్జున రెమ్యూనరేషన్ ఇచ్చాడంట. అది కూడా సగం కట్ చేసి చివరికి ఐదు లక్షలు చేతిలో పెట్టాడని చెప్పుకొచ్చాడు.