Batti Vikramarka: తెలంగాణ కాంగ్రెస్ లో తరచుగా కొన్ని వివాదాలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా BRS నేతలు ఆరోపణల ప్రకారం, కాంగ్రెస్ నేతల మధ్యలో సమన్వయం లేదని చాలా రకాల విబేధాలు ఉన్నట్లు చెప్పే మాట. అయితే ఈ విషయంలో ఫైనల్ గా ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క (Batti Vikramarka) ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తెలంగాణ కాంగ్రెస్‌లో ఎలాంటి విభేదాలు లేవని తేల్చిచెప్పారు.
కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఖండించారు. ‘‘మా అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక కొందరు కాకుల్లా అరుస్తున్నారు. వాటికి ప్రజలు ప్రాధాన్యం ఇవ్వరు,’’ అని ఆయన వ్యాఖ్యానించారు. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి నిర్ణయం పార్టీ అధిష్ఠానం తీసుకుంటుందని భట్టి (Batti Vikramarka) తెలిపారు. మూసీ ప్రాజెక్టు నిర్వాసితులకు రుణ సదుపాయాలు కల్పించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని భట్టివిక్రమార్క పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై అప్పుడే అంత వ్యతిరేకతా.?
హైకోర్టు తీర్పును ప్రభుత్వం పూర్తి స్థాయిలో గౌరవిస్తోందని, ప్రాజెక్టు విషయంలో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ముందుకు వెళతామని చెప్పారు. ‘‘నిర్వాసితుల పునరావాసం లోపంలేకుండా ఉండేలా చర్యలు తీసుకుంటాం,’’ అని ఆయన హామీ ఇచ్చారు. ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకొని బీఆర్ఎస్ నేతలు వేలాది ఎకరాలు కాజేశారని భట్టి విక్రమార్క (Batti Vikramarka) ఆరోపించారు. ‘‘బీఆర్ఎస్ నేతలు (BRS Leaders) చేసిన భూకబ్జాలను త్వరలో ప్రజల ముందుంచుతాం. ప్రజల ఆస్తులను కాపాడటమే మా ప్రధాన లక్ష్యం,’’ అని స్పష్టం చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
ప్రతిపక్షాల ఆరోపణలను పసలేని ప్రచారంగా అభివర్ణించిన భట్టి విక్రమార్క (Batti Vikramarka), ‘‘మా పాలనను చూసి వారికే భయం పట్టుకుంది. ప్రజల సమస్యలపై చర్చించకుండా, తప్పుడు ఆరోపణలతో గందరగోళం సృష్టించడమే వారి పని,’’ అని మండిపడ్డారు. ‘‘ప్రజల అభిమానం కేవలం అభివృద్ధిని చూసి వస్తుంది. ఆ విషయంలో కాంగ్రెస్ ఎప్పుడూ ముందుంది,’’ అని భట్టి అన్నారు.