RGV: వర్మకు షాక్ ఇచ్చిన హైకోర్టు… కోయంబత్తూర్ వెళ్లిన ఏపీ పోలీసులు!

RGV: సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు హైకోర్టు నుంచి మరోసారి బిగ్ షాక్ తగిలింది. ఈయనపై నమోదైన కేసులో భాగంగా తనకు ముందస్తు బెయిల్ కావాలి అంటూ ఈయన హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పిటిషన్ విచారణ ఎప్పుడు జరగాల్సి ఉండగా తరచు వాయిదా పడుతూ వస్తూ నేడు విచారణ జరిగింది. ఇక ఈ పిటిషన్ పరిశీలించిన హైకోర్టు మరోసారి బెయిల్ పిటిషన్ ను వాయిదా వేసింది.

ఇలా ఏపీలో తనపై నమోదైన కేసులో తనకు ముందస్తు బెయిల్ కావాలని ఈయన కోర్టును కోరారు. పోలీసులు అరెస్టు చేస్తే తనపై థర్డ్ డిగ్రీ ఉపయోగించే అవకాశాలు ఉన్నాయని అందుకే తనకు ముందస్తు బెయిల్ కావాలని ఈయన కోర్టును కోరారు కానీ కోర్టు మాత్రం ఈయనకు బెయిల్ మంజూరు చేయకుండా తన పిటీషన్ మరోసారి విచారణకు వాయిదా వేసింది.

ఇలా కోర్టు నుంచి బెయిల్ మంజూరు కాకపోవడంతో ఈయన కాస్త ఇబ్బందులలోనే ఉన్నారని చెప్పాలి. ఇంకా ఇప్పటికే పోలీసులు ఈయన కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వర్మ పరారీలో ఉన్నారని వార్తలు రాగా ఈయన మాత్రం తాను పారిపోలేదని ఎవరికి భయపడటం లేదు అంటూ ఒక వీడియోని విడుదల చేశారు. ఈ వీడియో ఆధారంగా ఈయన కోయంబత్తూర్ లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

ఈ క్రమంలోనే రాంగోపాల్ వర్మ కోసం ఏపీ పోలీసుల కోయంబత్తూర్ వెళ్లినట్టు సమాచారం. ఇక ఈయన గత ఏడాది వ్యూహం సినిమా సమయంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు లోకేష్ ఫోటోలను మార్ఫింగ్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన నేపథ్యంలోనే ఈయనపై కేసు నమోదు అయింది ఇలా గత ఏడాది ఈయన చేసిన పోస్ట్ కు ఇప్పుడు తన పట్ల కేసు నమోదు కావడానికి వర్మ కూడా తప్పుపట్టారు. మరి ఈయన ఈ కేసు నుంచి బయటపడతారా లేకపోతే అరెస్టు కావలసి వస్తుందా అనేది తెలియాల్సి ఉంది.