Keerthy Suresh: మహానటి కీర్తి సురేష్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కొందరు మాత్రం కీర్తి సురేష్ పెళ్లి వేడుక కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఎటువంటి హంగులు ఆర్బాటలు లేకుండా కీర్తి సురేష్ తన పెళ్లి ప్రకటన చేయడంతో అభిమానులు ఒకసారి అయ్యారు. ఒక రెండు మూడు రోజులపాటు ఈ విషయంపై అభిమానులు అనుమానాలను కూడా వ్యక్తం చేశారు.
ఇదే విషయంపై కీర్తి సురేష్ తండ్రి అధికారికంగా స్పందించడంతో సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అని నిజమని నమ్మారు. ఇది ఇలా ఉంటే తాజాగా కీర్తి సురేష్ కూడా తన రిలేషన్షిప్ గురించి పెళ్లి గురించి స్పందించింది. తన కాబోయే భర్తతో దీపావళి వేడుకల్లో కలిసి దిగిన ఫొటోని షేర్ చేస్తూ.. దాదాపు 15 ఏళ్ల తమ స్నేహబంధం ఇకపై జీవితాంతం కొనసాగనుంది అని రాసుకొచ్చింది కీర్తి సురేష్. అయితే ఈ పోస్ట్ పై సెలబ్రిటీలు అలాగే అభిమానులు స్పందిస్తూ.. కీర్తి సురేష్ కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
హీరోయిన్ రాశి కన్నా సైతం ఈ పోస్ట్ పై స్పందిస్తూ మేము ఇప్పుడే తెలుసుకున్నాం.. కంగ్రాట్స్ లవ్ అంటూ కామెంట్ చేసింది. ప్రస్తుతం ఇదే విషయం టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే డిసెంబర్ 4వ తేదీ వీరి వివాహం జరిగనున్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.