డిసెంబర్ 6న అక్కినేని ఇంట్లో పెళ్ళి బాజాలు మోగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అందరూ నాగచైతన్య పెళ్లి హడావుడిలో ఉండగా ఒకసారి గా అక్కినేని అఖిల్ నిశ్చితార్థం జైనబ్ రవ్జీ తో జరిగిపోయింది అంటూ నాగార్జున సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే జైనబ్ గురించి ఎవరికి ఏమి తెలియకపోవటంతో ఆమె గురించి ఆరాలు ప్రారంభించారు నెటిజన్స్.
అసలు ఆమె ఎవరు, ఆమె ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఏంటి ఆమె ఏం చేస్తుంది? ఇవన్నీ మనం కూడా తెలుసుకుందాం రండి. జైనబ్ థియేటర్ ఆర్టిస్ట్, ఈమె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఇండియాలోనే కాకుండా దుబాయ్ లండన్ లో ఆమెకి ఆర్టిస్టుగా మంచి పేరు ఉంది. ఈమె వేసే పెయింటింగ్స్ కి ఇంటర్నేషనల్ లెవెల్ లో ప్రశంసలు దక్కుతున్నాయి. హైదరాబాదులో కూడా ఆమె పలు ప్రదర్శనలు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈమె సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.
కానీ అఖిల్ తో నిశ్చితార్థం జరిగిన తరువాత తన సోషల్ మీడియా అకౌంట్స్ ని ప్రైవేట్ గా మార్చేసింది. ఈమె ఎకౌంట్ ని రాణా. మిహిక, ఉపాసన, మెహరీన్ ఇలా చాలామంది సెలబ్రిటీలు ఇప్పటికే ఫాలో అవుతున్నారు. ఈమెకి ఒక సొంత బ్యూటీ కేర్ కంపెనీ కూడా ఉంది.ఈమె జుల్ఫీ రవ్జీ కుమార్తె. ఆయన రియల్ ఎస్టేట్ టైకూన్, నిర్మాణ పరిశ్రమలో ఆయనకు 30 ఏళ్ళకి పైగా అనుభవం ఉంది.
జగన్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సలహాదారుగా కూడా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మిడిల్ ఈస్ట్ ఫర్ ఈస్ట్ కంట్రోల్ స్పెషల్ గా కూడా జుల్ఫీ పని చేశారు. అంతేకాకుండా నాగార్జునకి కూడా బిజినెస్ పరంగా అత్యంత సన్నిహితుడు. వీరిద్దరి మధ్య చాలా కాలం నుంచి స్నేహం ఉన్నట్టు తెలుస్తోంది. జైనాబ్ అఖిల్ కంటే వయసులో పెద్దది అనే వార్తలు వినిపిస్తున్నాయి మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలి.
We are thrilled to announce the engagement of our son, @AkhilAkkineni8, to our daughter in law to be Zainab Ravdjee!
We couldn’t be happier to welcome Zainab into our family. Please join us to congratulate the young couple and wish them a lifetime filled with love, joy, and… pic.twitter.com/5KM7BU00bz
— Nagarjuna Akkineni (@iamnagarjuna) November 26, 2024