Naga Babu: ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మూడు స్థానాలు కూడా వైసీపీ నుంచి విజయం సాధించిన రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేయడంతో తిరిగి ఈ మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇలా మూడు స్థానాలకు గాను తెలుగుదేశం జనసేన బాజాపా మూడు పార్టీల నుంచి ఒక్కొక్కరు చొప్పున ముగ్గురిని ఎంపిక చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే జనసేన పార్టీ నుంచి మెగా బ్రదర్ నాగబాబు రాజ్యసభ ఎంపీగా ఎన్నిక కాబోతున్నట్టు సమాచారం. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా నాగబాబు జనసేన పార్టీ వ్యవహారాలు అన్నింటిని కూడా చక్కదిద్దుతున్న సంగతి తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్ తన పనులలో బిజీగా ఉన్న నేపథ్యంలో నాగబాబు మంగళగిరి నియోజకవర్గ పనులను అలాగే అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఈయన స్వయంగా దగ్గరుండి చూసుకుంటున్నారు.
నిజానికి నాగబాబు గత ఎన్నికలలో అనకాపల్లి ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాల్సి ఉండగా పొత్తులో భాగంగా ఆస్థానం బీజేపీకి ఇవ్వాల్సి రావడంతో ఈయన ఎంపీ పోటీ నుంచి కూడా తప్పుకున్నారు. తాజాగా పెద్దల సభలు తన అన్నయ్యకు ఉన్నత పదవి కల్పించడానికి పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారని తెలుస్తుంది.
నాగబాబు జనసేన నుంచి ఎంపీగా వెళితే జనసేన నుంచి రాజ్యసభకు వెళ్లిన తొలి ఎంపీగా ఆయన రికార్డుల్లోకి ఎక్కుతారు. అలా జనసేన హిస్టరీలో తొలి రాజ్యసభ ఎంపీ అయిన క్రెడిట్ ఆయన పేరు మీద ఉండబోతుందని తెలుస్తుంది. మరి ఈ విషయంలో ఎంతవరకు నిజముంది అనేది తెలియాల్సి ఉంది. అయితే గతంలో నాగబాబు రాజ్యసభకు వెళ్తారు అనే విషయంపై నాగబాబు స్పందిస్తూ తాను పదవులు ఆశించి రాజకీయాలలోకి రాలేదని చెప్పిన సంగతి తెలిసిందే.