Maa Kaali: 55వ IFFIలో ‘మా కాళి’ హై ప్రొఫైల్ వరల్డ్ ప్రీమియర్‌కు హాజరైన గోవా సిఎం ప్రమోద్ సావంత్

Maa Kaali: నేషనల్ అవార్డ్ విన్నింగ్ సూపర్‌హిట్ చిత్రం కార్తికేయ 2 నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అప్ కమింగ్ మల్టీ లింగ్వల్ మూవీ ‘మా కాళి’ 55వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ఆఫ్ ఇండియా (IFFI). వరల్డ్ ప్రీమియర్ కి గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ (Pramod Sawant), బెంగాల్ గవర్నర్ ఆనంద బోస్‌ (Ananda Bose)తో పాటు నిర్మాత శ్రీమతి వందనా ప్రసాద్, దర్శకుడు విజయ్ యెలకంటి (Vijay Yelakanti), లీడ్ యాక్టర్ అభిషేక్ సింగ్, డిజిపి గోవా పోలీస్ అలోక్ కుమార్ IPS హాజరయ్యారు.

మా కాళి (Maa Kaali) ప్రీమియర్ ప్రేక్షకులు, ప్రముఖుల నుంచి స్టాండింగ్ ఒవేషన్ అందుకుంది. భారతీయ చరిత్రలో చెరిపివేయబడిన అధ్యాయం ఆధారంగా, మా కాళి శక్తివంతమైన కథ, ప్రభావవంతమైన పెర్ఫార్మెన్స్ లతో బెంగాల్‌లోని అన్‌టోల్డ్ చాప్టర్స్ ని ప్రజెంట్ చేస్తోంది.

కలకత్తా, నోఖాలీలో జరిగిన క్రూరమైన నరమేధ రక్తపాత సత్యాన్ని హైలైట్ చేస్తూ, భారతదేశ విభజనకు దారితీసిన డైరెక్ట్ యాక్షన్ డే వెనుక ఉన్న సత్యాన్ని ముందుకు తీసుకురావాలనేది మా కాళి లక్ష్యం.

మా కాళి (Maa Kaali) సోషియో-పోలిటికల్ సబ్జెక్ట్ ప్రస్తుత కాలంలోని అత్యంత ముఖ్యమైన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. 1946 నుండి నేటి బంగ్లాదేశ్ వరకు హిందువులను పీడించడం, బెంగాల్ మతపరమైన అల్లకల్లోలాలను చిత్రీకరిస్తూ, మా కాళి Citizen Amendment Act (CAA) ప్రాముఖ్యతను, దాని అమలు యొక్క అవసరాన్ని కూడా హైలైట్ చేస్తుంది.

Batti Vikramarka: తెలంగాణ కాంగ్రెస్ లో విబేధాలు.. భట్టివిక్రమార్క ఏమన్నారంటే..

ప్రీమియర్ షోలో గోవా సీఎం ప్రమోద్ సావంత్ (Pramod Sawant) ఈ చిత్రం గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు, “మా కాళి (Maa Kaali) వరల్డ్ ప్రీమియర్‌లో, సినిమాని మొదటి వీక్షకులుగా చిత్ర బృందంతో పాటు ప్రేక్షకులందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా కాళి భారతదేశ విభజన, డైరెక్ట్ యాక్షన్ డే ఆధారంగా రూపొందించబడింది, యాదృచ్ఛికంగా, ఈ చిత్రం నవంబర్ 26న భారత రాజ్యాంగ దినోత్సవం రోజున ప్రదర్శించబడింది. మన దేశం 1947లో స్వాతంత్ర్యం పొంది, కొన్నేళ్లకు ఇండియా, పాకిస్థాన్‌గా మారింది, తర్వాత 1971 నాటికి పాకిస్థాన్, బంగ్లాదేశ్‌గా మారింది, ఒక దేశం మూడు ముక్కలైంది, అయినప్పటికీ, భారతదేశం మాత్రమే ఇప్పటికీ రాజ్యాంగాన్ని నమ్ముతుంది, ప్రాముఖ్యత ఇస్తుంది.

బంగ్లాదేశ్‌లోని సామాజిక-రాజకీయ పరిస్థితులతో పాటు పాకిస్తాన్‌లోని రాజకీయ వాతావరణం గురించి మనందరికీ బాగా తెలుసు. మరోవైపు, భారతదేశం తన పౌరుడి అభివృద్ధిని విశ్వసిస్తుంది, తోటి పౌరుల మద్దతు నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. నేను ఇటీవల బంగ్లాదేశ్‌ను సందర్శించాను. మైనారిటీలు అంటే హిందువుల పరిస్థితులను స్వయంగా చూశాను. మా కాళి (Maa Kaali) నిజమైన కథ ఆధారంగా రూపొందించబడింది. చాలా తక్కువ మందికి నిజం చెప్పే ధైర్యం ఉంటుంది, కాబట్టి నేను చిత్ర నిర్మాతలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డైరెక్ట్ యాక్షన్ డే అనేది మన దేశ చరిత్రలో ఒక బ్లాక్ డే. నేడు, పౌరసవరణ చట్టం (CAA), మేము ఆ మైనారిటీలను భారతదేశానికి తిరిగి తీసుకురాగలుగుతున్నాము’ అన్నారు

గౌరవనీయులైన ముఖ్యమంత్రి టీమ్‌ను అభినందిస్తూ సోషల్ లో పోస్ట్ లో చేశారు .

https://x.com/drpramodpsawant/status/1861460668588920924?s=48&t=83QHyhN0lWxEv9ySfFHwjQ

ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్‌లో చిత్రానికి వచ్చిన రెస్పాన్స్‌ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ దర్శకుడు విజయ్ యెలకంటి (Vijay Yelakanti) మాట్లాడారు. “ఐఎఫ్‌ఎఫ్‌ఐలో మా చిత్రాన్ని ప్రదర్శించడమే కాకుండా, గోవా గౌరవ ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ (Pramod Sawant) జీ, బెంగాల్ గవర్నర్ ఆనంద బోస్ (Ananda Bose) జీ నుండి వచ్చిన ప్రశంసలు సత్కారంగా భావిస్తున్నాం. ఇది మా కాళి (Maa Kaali) టీమ్ మొత్తానికి గర్వంగా, సంతృప్తిగా ఉంది. ప్రేక్షకుల నుండి మంచి స్పందన చాలా ప్రోత్సాహకరంగా ఉంది. ఈ చిత్రం థియేటర్లలో విడుదల కోసం మేము ఎదురుచూస్తున్నాము.

అభిషేక్ సింగ్ మాట్లాడుతూ: “ఇటువంటి ప్రతిష్టాత్మక వేదిక వద్ద మా ప్రయత్నాలను గుర్తించడం , ప్రశంసించడం ఒక గొప్ప అనుభూతి. మా కాళి (Maa Kaali) చాలా ముఖ్యమైన చిత్రం, ముఖ్యంగా నేటి ప్రేక్షకులు భావోద్వేగాలతో ప్రతిధ్వనించినందుకు , మాపై వారి ప్రేమను కురిపించినందుకు మేము సంతోషిస్తున్నాము’ అన్నారు

నిర్మాత వందనా ప్రసాద్ గారు గోవాలోని 55వ ఐఎఫ్‌ఎఫ్‌ఐలో జరిగిన మా కాళి (Maa Kaali) ప్రీమియర్‌లో సినిమాకి ప్రోత్సాహాన్ని అందించిన గౌరవనీయమైన పశ్చిమ బెంగాల్ గవర్నర్‌కి కృతజ్ఞతలు తెలిపారు. నిజమైన కథలను తెరపైకి తీసుకురావడానికి తమ నిబద్ధతను తెలియజేశారు.

విజయ్ యెలకంటి (Vijay Yelakanti) రచన, దర్శకత్వం వహించిన మా కాళిని TG విశ్వ ప్రసాద్ నిర్మించారు, కార్తికేయ 2 పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు సమర్పిస్తున్నారు. ఈ పాన్-ఇండియన్ చిత్రం హిందీలో చిత్రీకరించబడింది, బెంగాలీ, తెలుగులో 2025లో థియేటర్లలో విడుదల కానుంది.

తారాగణం: రైమా సేన్, అభిషేక్ సింగ్

సిబ్బంది:
నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్
రచన & దర్శకత్వం: విజయ్ యెలకంటి
క్రియేటివ్ ప్రొడ్యూసర్: కృతి ప్రసాద్
సహ నిర్మాత: వివేక్ కూచిబొట్ల
D.O.P: ఆచార్య వేణు
ప్రొడక్షన్ డిజైనర్: కిరణ్ కుమార్ మన్నె
సంగీతం: అనురాగ్ హల్డర్
ఎడిటర్: కిరణ్ గంటి
డైలాగ్స్: అమర్నాథ్ ఝా
ఒరిజినల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: రూషిన్ దలాల్ & కైజాద్ గెర్డా
లిరిసిస్ట్: కునాల్ వర్మ
యాక్షన్: వింగ్ చున్ అంజి
కాస్ట్యూమ్స్: ఆశా గొందూరు
సౌండ్ డిజైనర్: J.R. ఇతిరాజ్
ఆర్ట్ : అబిస్టా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గురు శరణ్ యండమూరి
కో డైరెక్టర్: శ్రీ నివాస్ డి

DSP Comments On Kissik Song Event | Dsp Vs Mythri Producers What Happened ? | Telugu Rajyam