Evm: ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా ఎన్నికలను నిర్వహిస్తుండగా ఈ ఎన్నికలను ఈవీఎం పద్ధతిలో నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈవీఎంల పట్ల ఎంతోమంది తీవ్ర స్థాయిలో వ్యతిరేకత చూపుతున్న సంగతి తెలిసిందే. ఈవీఎంల పని తీరుపై పలువురు రాజకీయ నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వంటి వారు ఈవీఎంల పనితీరు పట్ల ఎన్నో సందేహాలను వ్యక్తం చేశారు.
ఈవీఎంలను టాంపరింగ్ చేసే ఎన్నికలలో గెలుపొందుతున్నారని అందుకే ఈవీఎంలను క్యాన్సిల్ చేసి బ్యాలెట్ పద్ధతి ద్వారా ఎన్నికలు నిర్వహించాలి అంటూ ఇప్పటికే పలువురు నేతలు ఆరోపణలు చేస్తున్నారు ఈ క్రమంలోనే ఈ విషయంపై కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఈ పిటిషన్ పట్ల కోర్ట్ విచారణ జరపగా ఈ పిటీషన్ పూర్తిగా తప్పు పడుతూ కొట్టి వేసింది.
ఎన్నికల్లో గెలిస్తే ఈవీఎంలు పనిచేసినట్టు.. ఓడిపోతే ట్యాంపరింగ్ జరిగినట్టా..? అని ఈ సందర్భంగా పిటిషనర్ను దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. రాజకీయ నాయకులు ఓడిపోయినప్పుడు మాత్రమే ఈవీఎంల పనితీరుపై ప్రశ్నలు వేస్తారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.ఎన్నికలను ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పద్దతిలో నిర్వహించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సీఎం చంద్రబాబు నాయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వంటి వారు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చు అని ఈయన సందేహాలను వ్యక్తం చేశారు.నా గ్లోబల్ పీస్ సమ్మిట్ సందర్భంగా కూడా ఈవీఎం టెక్నాలజీని ట్యాంపరింగ్ చేయవచ్చని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ చెప్పారని కేఏ పాల్ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఎన్నికలను ఈవీఎం ద్వారా కాకుండా బ్యాలెట్ విధానం ద్వారా నిర్వహించాలని ఈయన కోర్టును కోరారు.