AP: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తుంది. ఈ క్రమంలోనే ఈ సూపర్ సిక్స్ హామీలలో భాగంగా పెన్షన్ల పెంపు కార్యక్రమాన్ని మొదట నెరవేర్చారు ఇలా రాష్ట్రవ్యాప్తంగా కూటమి సర్కార్ నిర్ణయించిన కొత్త పెన్షన్లను చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన మొదటి నెల విడుదల చేశారు.
ఇక ప్రతి నెల ఒకటో తేదీ ఉదయం 6 గంటలకే సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటింటికి వెళ్లి పెన్షన్లను అందజేస్తున్న విషయం మనకు తెలిసిందే అయితే తాజాగా పెన్షన్ల పంపిణీ విషయంలో ఏపీ సర్కారు మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ప్రతినెలా ఒకటవ తేదీన పెన్షన్లను పంపిణీ చేసే ప్రభుత్వం ఈసారి ఒకరోజు ముందుగానే లబ్ధిదారులకు పెన్షన్ అందజేయబోతున్నట్టు తెలుస్తుంది.
రాష్ట్ర వ్యాప్తంగా ఒకటో తేదీన పెన్షన్ల పంపిణీ అంశాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. పంపిణీ విధానాన్ని రియల్ టైం లో పరిశీలిస్తోంది. ఒకటో తేదీనే దాదాపుగా పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం గడువు పెట్టింది అయితే ఈసారి మాత్రం డిసెంబర్ ఒకటవ తేదీ ఆదివారం రావడంతో రెండో తేదీ కాకుండా నవంబర్ 30వ తేదీనే పింఛన్లను పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.ఈ మేరకు సచివాలయాల సిబ్బంది .. నగదు పంపిణీ సిద్దం చేయాలని స్పష్టం చేసింది. దీంతో, రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షల కు పైగా ఉన్న పెన్షన్ లబ్ది దారులకు నవంబరు 30న శనివారం రోజున పెన్షన్లు అందనున్నాయి. వరుసగా రెండు నెలలు పెన్షన్లు తీసుకోని వారు సైతం ..మూడో నెల ఒకేసారి పెన్షన్లు తీసుకునే విధంగా చర్యలను చేపట్టారు.
ఇలా గత ప్రభుత్వ హయాంలో ఒకటో తేదీనే డబ్బులు ఇచ్చేవారు. కానీ ఒకటో తేదీ సెలవు రావడంతో కూటమి ప్రభుత్వం మాత్రం ఏకంగా నవంబర్ 30వ తేదీనే పింఛన్లను పంపిణీ చేయడానికి శ్రీకారం చుట్టడంతో లబ్ధిదారులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.