Devi Sri Prasad: ‘పుష్ప 2: ది రూల్’ పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతుండగా, నేపథ్య సంగీతం చుట్టూ అనేక రకాల గుసగుసలు వినిపిస్తున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) మ్యూజిక్ పనితీరుపై దర్శకుడు సుకుమార్ (Sukumar) అసంతృప్తిగా ఉన్నట్లు, దీంతో ఇతర సంగీత దర్శకులను తీసుకొచ్చినట్లు పుకార్లు చక్కర్లు కొట్టాయి. తమన్, సామ్ సీఎస్, అజనీష్ లోక్‌నాథ్‌ల పేర్లు కూడా ఈ క్రమంలో బయటికి వచ్చాయి. ఈ నేపథ్యంలో, చెన్నైలో జరిగిన ‘పుష్ప 2’ (Pushpa 2) సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో దేవిశ్రీ ప్రసాద్ చేసిన కొన్ని వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
“ప్రేమ కంటే కంప్లయింట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయి. సంగీత దర్శకుడిగా తన క్రెడిట్, రెమ్యునరేషన్ విషయంలో కూడా దేవి (Devi Sri Prasad) ఇన్‌డైరెక్ట్‌గా అసహనం వ్యక్తం చేసినట్లు అందరూ భావించారు. ఈ నేపథ్యంలో నిర్మాత రవిశంకర్ ‘రాబిన్ హుడ్’ ప్రెస్ మీట్‌లో క్లారిటీ ఇచ్చారు. “దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) అన్నీ ప్రేమతో చెప్పారు. మా సంబంధాలు బలంగా ఉన్నాయి. ఆయన మాటల్లో ఎలాంటి తప్పు లేదు. దేవి, సుకుమార్ (Sukumar) మధ్య ఏ చిన్న సమస్య కూడా లేదు” అంటూ వివరణ ఇచ్చారు.
Devi Sri Prasad: లేట్ విషయంలో నేనేం చేయలేను : దేవీశ్రీ ప్రసాద్
ఈ వివరణతో దేవిశ్రీ ప్రసాద్ తదుపరి మైత్రి ప్రాజెక్టులపై వచ్చిన పుకార్లకు తెరపడినట్లైంది. దేవి ప్రస్తుతం మైత్రి లోనే ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘రామ్ చరణ్ 17’ వంటి పెద్ద ప్రాజెక్టులకు మ్యూజిక్ అందిస్తున్నారు. పుష్ప 2 (Pushpa 2) విజయంతో ఆయన మ్యూజిక్ మరింత హైలైట్ అవుతుందన్న నమ్మకం బలపడుతోంది. పుష్ప 2 (Pushpa 2) బీజీఎం, సాంగ్స్ ఇప్పటికే ట్రెండింగ్‌లో ఉండటంతో, దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) తన ప్రతిభను మరోసారి నిరూపించుకున్నారు. ఇదిలా ఉంటే, పుష్ప 2 ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో గ్రాండ్ ఈవెంట్లు ప్లాన్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) ఈ ఈవెంట్లలో పాల్గొని మరింత ఆసక్తికరమైన విషయాలను వెల్లడించే అవకాశం ఉంది.