సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలోను కష్టసుఖాలు సర్వసాధారణంగా ఉంటాయి. కొద్ది రోజులపాటు కష్టాలను ఎదుర్కొంటే అనంతరం సంతోషాలు కూడా వెంటే వస్తుంటాయి.ఇక సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రిటీల జీవితం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరి జీవితాలు ఎప్పుడు ఎలా తలకిందులు అవుతాయో ఎవరికీ తెలియదు. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఎన్టీఆర్ కూడా ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారని చెప్పాలి.
ఈయన ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు సంవత్సరాల పాటు ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్ 2009వ సంవత్సరం నుంచి 2014 వసంవత్సరం వరకు ఎన్నో కష్టాలను ఇబ్బందులను ఎదుర్కొన్నారట.2009వ సంవత్సరంలో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారానికి వెళ్లారు. అయితే ఈ ప్రచార సమయంలో ఈయన ప్రమాదానికి గురి కావడం అందరిని భయభ్రాంతులకు గురి చేసింది. అయితే ఈ ప్రమాదం నుంచి ఎన్టీఆర్ కోలుకోవడానికి చాలా సమయం పట్టింది.
ఇక ఎన్టీఆర్ ప్రమాదం కారణంగా డాన్స్ చేయకూడదని డాక్టర్లు చెప్పినప్పటికీ ఈయన మాత్రం సినిమాలపై ఆసక్తితో తన మొండి పట్టును విడవలేదు. ఇక 2010వ సంవత్సరంలో ఎన్టీఆర్ కొత్త సమీప బంధువు అయినటువంటి లక్ష్మీ ప్రణతితో వివాహం నిశ్చయమైంది అయితే ఈమె వివాహానికి ఇంకా వయసు లేకపోవడంతో వివాహసమయంలో కూడా ఎన్టీఆర్ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు తన మైనారిటీ తీరిన తర్వాతే పెళ్లి చేసుకున్నారు. ఇక 2011వ సంవత్సరంలో ఎన్టీఆర్ నటించిన శక్తి ,ఊసరవెల్లి, దమ్ము, రామయ్య వస్తావయ్య, రభస, బాద్ షా వంటి వరుస సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.ఇదే సమయంలోనే ఎన్టీఆర్ కి చంద్రబాబునాయుడుకు మధ్య మనస్పర్ధలు కూడా వచ్చాయని వార్తలు వినిపించాయి.ఇక 2015వ సంవత్సరంలో టెంపర్ సినిమా ద్వారా కాస్త ఊపిరిపించుకున్నటువంటి ఎన్టీఆర్ రాజకీయాలకు పూర్తిగా దూరమై సినిమాలపై శ్రద్ధ పెట్టారు. ఇలా ఈ ఆరు సంవత్సరాలు పాటు ఎన్టీఆర్ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారని చెప్పాలి.