అతిగా కూర్చుని పని చేసేవాళ్లకు షాకింగ్ న్యూస్.. ఈ సమస్యలు వచ్చే ఛాన్స్!

ప్రస్తుత కాలంలో చాలామంది వృత్తి వల్ల ఎక్కువ సమయం పాటు ఒకే చోట కూర్చుని పని చేస్తుంటారు. అయితే ఇలాంటి వాళ్లకు గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. మాస్ జనరల్ బ్రైగోమ్ పరిశోధనల అధ్యయనం ద్వారా ఈ విషయాలు వెల్లడయ్యాయి. అతిగా కూర్చునే వాళ్లు కొంత సమయం పాటు వ్యాయామం చేసినా ఫలితం ఉండటం లేదని తెలుస్తోంది.

తక్కువగా వ్యాయామం, శారీరక శ్రమ ఉన్నవాళ్లు ఆ అలవాటును మార్చుకోకపోతే మాత్రం గుండెజబ్బుల వల్ల ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు. చురుకుగా గడిపే సమయాన్ని పెంచుకోవడం ద్వారా అదిరిపోయే బెనిఫిట్స్ పొందవచ్చు. రోజుకు 10 గంటల పాటు కూర్చునే వాళ్లు ఎక్కువగా ఈ సమస్య బారిన పడే అవకాశాలు ఉంటాయి. రోజులో కూర్చోవడం వీలైనంత తగ్గిస్తే మంచిదని కచ్చితంగా చెప్పవచ్చు.

ఎక్కువ సమయం పాటు కూర్చోవడం ఒక విధంగా పొగ తాగడంతో సమానమని వైద్యులు వెల్లడిస్తూ ఉండటం గమనార్హం. అతిగా కూర్చోవడం వల్ల జీవనశైలి వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. గంటల తరబడి కూర్చునే వాళ్లకు త్వరగా వృద్ధాప్యం వచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పవచ్చు. ఇలాంటి వ్యక్తులు డయాబెటిస్ బారిన పడే చాన్స్ కూడా ఉంటుందని కచ్చితంగా చెప్పవచ్చు.

60 నుంచి 75 నిమిషాలు శారీరక శ్రమ చేయడం ద్వారా ఎక్కువ గంటలు కూర్చోవడం వల్ల కలిగే పరిణామాలను కొంతమేర తగ్గించవచ్చు. ప్రతి అరగంట తర్వాత కొంత సమయం పాటు బ్రేక్ తీసుకోవడం ద్వారా ఈ సమస్య దూరమవుతుంది. ఫోన్ మాట్లాడుతున్న సమయంలోనూ కూర్చోకుండా నడవడం వల్ల మంచి బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ విధంగా చేయడం ద్వారా సమస్యలను అధిగమించవచ్చు.