బాలయ్య ని రిక్వెస్ట్ చేసిన జూనియర్ ఎన్టీఆర్.. బాలయ్య చేయకపోగా తానే స్వయంగా చేశారు!

సూపర్ స్టార్ కృష్ణ గురించి మాట్లాడితే అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ ప్రస్తావన కచ్చితంగా వస్తుంది. ఆయన ఆ క్యారెక్టర్ కి అంత న్యాయం చేశారు. అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ మీద ఎన్ని సినిమాలు వచ్చిన అందులో కృష్ణ చేసినంత బాగా వేరెవరు చేయలేకపోయారు. అలాగే కొమరం భీముడు పాత్ర విషయానికి వస్తే నందమూరి తారకరామారావు ఆ సినిమాకి ప్రాణం పెట్టేశారు.

ఆ క్యారెక్టర్ లో ఎన్టీఆర్ ని తప్ప ఇంక ఎవరిని ఊహించుకోలేని విధంగా నటించారు సీనియర్ ఎన్టీఆర్. అయితే తర్వాత కొమరం భీం క్యారెక్టర్ మీద ఒక ఫుల్ లెన్త్ సినిమా చేయాలని ఎన్నో స్టార్ హీరోలు ప్రయత్నించారు కానీ విఫలమయ్యారు. నందమూరి బాలకృష్ణ హీరోగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన “పరమవీరచక్ర” అనే సినిమా ఆడియో లాంచ్ వేడుకలో దర్శకుడు రాఘవేంద్రరావు అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా పాల్గొన్నారు.

ఈ సినిమా ఆడియో లాంచ్ లో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ సినిమాలో బాలయ్యని పది తలల రావణుడిగా చూపించారు అది చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు. అలాగే కొమరం భీం పాత్రలో కూడా కనిపించారు బాలయ్య అయితే దాసరి నారాయణరావు, బాలయ్య ఇద్దరూ కలిసి కొమరం భీమ్ అనే సినిమా తీస్తే చాలా బాగుంటుంది. నా మాటలు ఆ దేవుడి విని ఈ సినిమా జరిగితే అంతకన్నా ఆనందం ఇంకేమీ లేదు.

ఈ సినిమా చేయండి బాబాయ్ అని బాలయ్య ని రిక్వెస్ట్ చేశారు ఎన్టీఆర్. విచిత్రం ఏంటంటే బాలయ్య అలాంటి సినిమా ఏమీ తీయకపోగా రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో అదే పాత్రను ఎన్టీఆర్ పోషించారు. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రను పోషించారు. ఈ పాత్రలు ఫిక్షనల్ అయినప్పటికీ కూడా ఇద్దరికిద్దరూ వారి నటనలతో ఆ పాత్రలకు న్యాయం చేశారు. బాబాయ్ ని రిక్వెస్ట్ చేసి ఆయన చేయకపోగా తానే ఆ క్యారెక్టర్ ను చేయడం విశేషం. కొమరం భీముడిగా ఆ పాత్రకు న్యాయం చేసి తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్.