Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా డిసెంబర్ ఐదవ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు. అయితే ఈ సినిమాను ఎలాగైనా అడ్డుకోవాలని కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారంటూ వైకాపా మాజీ మంత్రి అంబంటి రాంబాబు మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా వైకాపా పార్టీకి మద్దతు తెలపడంతో అల్లు అర్జున్ అలాగే మెగా కుటుంబ సభ్యుల మధ్య వివాదం నెలకొంది. ఈ క్రమంలోనే మెగా అభిమానులు అలాగే మెగా హీరోలు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారి పరపతి ఉపయోగించి పుష్ప సినిమాని అడ్డుకొనే ప్రయత్నాలు చేస్తున్నారనీ, పుష్ప సినిమాని అడ్డుకోవడం ఎవరి తరం కాదు అంటూ ఈయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
అల్లు అర్జున్ ఇంటర్నేషనల్ స్టార్, పుష్ప 2 ను అడ్డుకోవడం ఎవరి తరం కాదు. ఈ సినిమా విషయంలో కొంతమంది చాలా జలసీగా ఫీల్ అవుతున్నారు. మంచి సినిమాలను ఎవరు అడ్డుకోలేరు గతంలో ఎన్టీఆర్ సినిమాని కూడా అడ్డుకోవాలని చూసిన వారి వాళ్ల కాలేదని అంబంటి గుర్తు చేశారు. ఎన్టీఆర్, అల్లు అర్జున్ ను బహిష్కరించాలని అనుకోవడం అవివేకం అని ఫైర్ అయ్యారు. అల్లు అర్జున్ గారి సినిమా మీద ఎంత మంది దుష్ప్రచారం చేసినా పుష్ప 2 ని చూడకుండా ఎవ్వడూ ఆపలేరు.
నందమూరి తారక రామారావు గారి కుటుంబం ఎన్టీఆర్ సినిమాని అడ్డుకున్నారా ఆ సినిమాని ఎవరు చూడకుండా ఆపగలిగారా..అలాగే అల్లు అర్జున్ సినిమాను కూడా ఆపలేరన్నారు. రాజబాబు హీరోగా నటించిన సినిమాను బ్రహ్మాండంగా చూశామని అంబటి పేర్కొన్నారు. ఎన్టీఆర్ సినిమాలు సైతం బాగోకుంటే ప్లాప్ అయ్యాయని గుర్తు చేశారు. అరచేయిని అడ్డుపెట్టుకొని సూర్యకాంతిని ఆపలేరు అలాగే పుష్ప సినిమాని కూడా ఎవరు ఆపలేరు అంటూ అంబటి చేసిన ఈ వ్యాఖ్యలు మరోసారి రాజకీయంగా తీవ్రదుమారం రేపుతున్నాయి. సినిమా విడుదలకు ముందు ఈయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో తప్పనిసరిగా పుష్ప సినిమాపై ఈ ప్రభావం పడుతుందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.