ఆ కాఫీ అతిగా తాగితే క్యాన్సర్ రావడం పక్కా.. ఆ కాఫీతో ఇంత ప్రమాదమా?

మనలో చాలామంది కాఫీని ఎంతో ఇష్టంగా తాగుతారు. ఇన్‌స్టెంట్ కాఫీ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఇన్‌స్టెంట్ కాఫీ అలవాటు ఉన్న వారు అక్రిలమైడ్ అనే రసాయనం విషయంలో అప్రమత్తంగా ఉండటం అవసరమని వైద్యులు చెబుతున్నారు. ఈ కెమికల్ వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్స్ అయితే ఉందని వైద్యులు వెల్లడిస్తున్నారు. వాస్తవానికి కాఫీ తాగడం వల్ల మతిమరుపు, ఆల్జైమర్స్, టైప్ 2 డయాబెటిస్ రిస్క్ తగ్గుతుంది.

ప్లాస్టిక్ తయారీలో, మురుగు నీరు శుద్ధి ప్రక్రియల్లో వినియోగించ్ అక్రిలమైడ్ శరీరంలో అతిగా చేరడం వల్ల ఇబ్బందులు తప్పవు. బేక్డ్ ఫుడ్స్‌తో పాటు ఇన్‌స్టెంట్ కాఫీలో కూడా ఈ కెమికల్ ను కొద్ది మొత్తంలో ఉపయోగిస్తారు. ఆహారాన్ని 120 డిగ్రీలకు మించి వేడి చేసిన సందర్భాల్లో ఈ కెమికల్ పుట్టే అవకాశాలు అయితే ఉంటాయి. ఇన్ స్టంట్ కాఫీ తాగేవాళ్లు ఎక్కువ మొత్తంలో కాకుండా కొద్ది మొత్తంలో కాఫీ తీసుకుంటే మంచిది.

అక్రిలమైడ్ శరీరంలో చేరకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ధూమపానం మానేయడం ద్వారా ఈ కెమికల్ శరీరంలోకి రాకుండా కొంతమేర జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఆహారాలను డీప్ ఫ్రై చేస్తే కూడా ఈ కెమికల్ శరీరంలో చేరే అవకాశాలు ఉంటాయి. నిప్పుల మీద ఆహారాన్ని కాల్చే వాళ్లు వాటిని బొగ్గులా ఆహారం మాడ్చకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

టోస్టెడ్ బ్రెడ్ వినియోగం కూడా వీలైనంతగా తగ్గించడం ద్వారా కూడా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఆవిరిపై లేదా మైక్రో వేవ్ పై ఆహారాన్ని వండటం ద్వారా ఈ సమస్య దూరమవుతుంది. ఇన్‌స్టెంట్ కాఫీ, ఇతర కాఫీ ప్రత్యామ్నాయాలకు బదులు డార్క్ రోస్టెడ్ కాఫీని ఎంచుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు.