చలికాలంలో కీళ్ల నొప్పులు వేధిస్తున్నాయా.. సమస్యకు సులువుగా చెక్ పెట్టే చిట్కాలివే!

ప్రస్తుతం దేశంలో చలి అంతకంతకూ పెరుగుతోంది. చలి పెరగడం వల్ల తెలుగు రాష్ట్రాల ప్రజలు కొంతమేర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వాహనాలను నడిపే వాళ్లకు ఎక్కువగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరోవైపు సీజన్ వ్యాధులు చాలామందిని ఇబ్బంది పెడుతున్నాయి. మరోవైపు ఇప్పటికే కీళ్ల నొప్పుల సమస్యలతో బాధ పడేవాళ్లకు ప్రస్తుతం ఆ సమస్య మరింత తీవ్రమవుతోంది.

కీళ్లు గట్టిపడడం, నడిచేందుకు జాయింట్లు సహకరించకపోవడం సమస్యల వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అయితే కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. చలికాలంలో కీళ్ల నొప్పులకు చెక్ పెట్టాలని భావించే వాళ్లు సమతుల్య ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. సల్ఫర్, క్యాల్షియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తరచూ తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.

ఈ ఆహారాలను తీసుకోవడం ద్వారా ఎముకలు దృఢంగా మారి కీళ్ల నొప్పులు దూరమవుతాయి. క్యాబేజీ, బచ్చలికూర, సిట్రస్ ఫ్రూట్స్, టమాటా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. శీతాకాలంలో చాలా మంది విటమిన్-డి లోపానికి గురయ్యే ఛాన్స్ ఉంటుంది. విటమిన్ డి అందని పక్షంలో కీళ్ల నొప్పులు మరింత పెరుగుతాయి. ఇలాంటి వాళ్లు వైద్యులను సంప్రదించి విటమిన్ డి సప్లిమెంట్లను తీసుకోవాలి.

చలికాలంలో తగినంత మంచినీరు తాగడం అశ్రద్ధ చేస్తే కూడా ఇబ్బందులు తప్పవు. శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకుంటే కీళ్ల నొప్పుల సమస్య దూరమవుతుంది. ఎప్పటికప్పుడు వేడి కాపడం వంటివి చేస్తే నొప్పులు తగ్గి ఉపశమనం లభిస్తుంది. కీళ్లవాతం సమస్యతో బాధ పడేవాళ్లు శరీరాన్ని వేడిగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి.