Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం, దాని ప్రీమియర్ షోల ద్వారా ఇప్పటికే మంచి హైప్ అందుకుంది. ముఖ్యంగా యూఎస్‌లో డిసెంబర్ 4న జరిగే ప్రీమియర్ షోలకుగాను అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా స్పెషల్ బెన్ఫిట్ షోలు ప్లాన్ చేస్తుండటం విశేషం.
సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు ట్రైలర్, సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ‘ఊ అంటావా’ స్థాయిలో ఐటెం సాంగ్ హైప్ రాకపోయినా, వ్యూస్ విషయంలో మాత్రం రికార్డులు క్రియేట్ అవుతున్నాయి. నిర్మాతలు సినిమా ప్రమోషన్లలో అగ్రెసివ్‌గా వ్యవహరిస్తున్నారు, ఇది బాక్సాఫీస్ వద్ద రికార్డులపై పాజిటివ్ ప్రభావం చూపనుంది. తాజాగా నిర్మాత అల్లు అరవింద్ ‘పుష్ప 2’ (Pushpa 2) ప్రత్యేక షో వీక్షించినట్లు సమాచారం. ఆయన చిత్రాన్ని చూసి ఎంతో సంతృప్తి వ్యక్తం చేసినట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Pushpa 2: పుష్ప 2 చెన్నై వైల్డ్ ఫైర్ ఈవెంట్ లో కిస్సిక్ సాంగ్ విడుదల
లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం, ‘పుష్ప 2’ (Pushpa 2) తొలి భాగం ఎమోషనల్ డ్రామాతో సాగుతుందని, ఈ ఎమోషన్స్ ప్రతి ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా ఉంటాయని టాక్. ఇంటర్వెల్ బ్యాగ్ నుంచి కథలో యాక్షన్ ఎలిమెంట్స్ ప్రవేశించి, రెండో భాగమంతా రేసీగా సాగుతుందట. సుకుమార్ (Sukumar) తన స్క్రీన్ ప్లే విధానంలో ఎమోషన్, యాక్షన్, మాస్ ఎలిమెంట్స్‌ను సమపాళ్లలో మేళవించి, ప్రతి పాత్రకు బలమైన ప్రాధాన్యం ఇచ్చారని సమాచారం.
అల్లు అర్జున్ (Allu Arjun) పాత్రలోని పవర్ఫుల్ మోమెంట్స్, ఇంటర్వెల్ నుంచి క్లయిమాక్స్ వరకు అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌లతో ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్ అందించబోతోందని టాక్. మొత్తానికి ‘పుష్ప 2’ (Pushpa 2) సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఓ మరో మాస్టర్‌పీస్‌గా నిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని ట్రేడ్ అనలిస్టులు విశ్వసిస్తున్నారు.