ఎన్టీఆర్ కెరియర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ దక్కించుకున్న దేవర సినిమా మంచి హిట్ టాక్ అందుకుంది కానీ కొంతమందికి మాత్రం ఈ కధ ఎక్కలేదనే చెప్పాలి. ఈ సినిమాని రెండు పార్ట్ లుగా చూపించవలసినంత అవసరం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కథ మొత్తం మొదటి పార్ట్ లోనే చూపించినప్పుడు రెండో పార్టీలో చూపించడానికి ఏముందంటూ కొరటాలని ఉద్దేశించి ప్రశ్నిస్తున్నారు.
100 కోట్లు వసూళ్ల సొంతం చేసుకున్న దేవర సినిమాకు ఫ్యాన్స్ నుంచి మంచి హిట్ వచ్చింది కానీ కొందరు మాత్రం దేవర సినిమాను తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ ఆచార్యతో పోలుస్తూ కామెంట్స్ చేశారు. బాహుబలి పార్ట్ 1 ముగింపు బాహుబలి పార్ట్ 2 పై క్యూరియాసిటీ రేకెత్తించేలా ఉంది కానీ దేవర సినిమా ముగింపు పార్ట్ 2 పై ఆసక్తి కలిగించేదిగా లేదు అంటూ సినీ విశ్లేషకులు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఓటీటీ లోకి వచ్చిన తర్వాత రెట్టింపు స్థాయిలో ట్రోలింగ్ జరిగింది. ఎన్టీఆర్ ని సరిగ్గా చూపించలేదని దర్శకుడు, కెమెరామెన్ మీద అంతా ఫైర్ అయ్యారు. దేవర 2 ఉండకపోవచ్చు అంటూ కొందరు పుకార్లు కూడా ప్రచారం చేశారు. సినిమాపై ప్రేక్షకుల స్పందన ఎలా ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద దాదాపు 500 కోట్ల వసూళ్లు నమోదయ్యాయి సినీ వర్గాల సమాచారం. అయితే దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాపై ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు అంటున్నారు.
సూపర్ హిట్ అయిన దేవర సినిమా అసలు కధ ఆ పార్ట్ 2 లో చెప్పాల్సి ఉందని, మొదటి పార్ట్ తో పోల్చితే రెండో పార్ట్ కి మరింత స్కోప్ ఉంటుందని అంటున్నారు. హార్ట్ టు లో ముఖ్యంగా చెప్పాల్సింది గ్యాంగ్స్టర్ యతి, దయ ఎవరు, అలాగే మురుగ పాత్ర ఎలా చచ్చిపోయింది, ఎవరు చంపేశారు, డీఎస్పీ తులసికి ఒంటిపై దెబ్బలు ఎలా తగిలాయి అలాగే దేవరని చంపింది ఎవరు అనే విషయాలను సెకండ్ పార్ట్ లో క్లారిటీ ఇస్తారంట. ఏది ఏమైనా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చేవరకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఈ సినిమా మేకింగ్ పై కన్ఫ్యూజన్ తప్పదు.