స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. అసిస్టెంట్ మేనేజర్, జీఎం, డీజీఎం, డిప్యూటీ సీ.ఐ.ఎస్.వో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. sbi.co.in అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండగా అధికారిక నోటిఫికేషన్‌లో ఇచ్చిన సంబంధిత అర్హతను కలిగి ఉన్న వ్యక్తులు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ఫీజు 750 రూపాయలుగా ఉండగా జనరల్, ఓబీసీ, ఈ.డబ్ల్యూ.ఎస్ అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది.
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి సందేహాలు ఉంటే సంబంధిత వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు ఏకంగా 85,000 రూపాయల వరకు వేతనం లభించనుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ఊహించని స్థాయిలో ప్రయోజనం చేకూరనుందని చెప్పవచ్చు.
వరుస జాబ్ నోటిఫికేషన్ల వల్ల నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, ఇన్ డైరెక్ట్ గా మేలు జరగనుంది. ఎస్బీఐలో జాబ్ కోరుకునే వాళ్లకు ఇది బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. ఎస్బీఐలో జాబ్ కావాలని భావించే వాళ్లు వెంటనే ఈ దిశగా దృష్టి పెడితే మంచిదని చెప్పవచ్చు.