ఆధార్ లో భారీ వేతనంతో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు.. ఎలా దరఖాస్తు చేయాలంటే?

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. డిప్యూటీ డైరెక్టర్, సీనియర్ అకౌంట్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీల భర్తీ దిశగా అడుగులు వేస్తోంది. uidai.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2025 సంవత్సరం జనవరి 25 ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వాళ్లు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వాళ్లకు దరఖాస్తు చేసుకునే సమయానికి గరిష్టంగా 56 సంవత్సరాల వయస్సు ఉండాలి. 7వ పే కమిషన్ ప్రకారం ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు రూ.67,700 నుంచి 1,77,500 వేతనం లభించనుంది. రీజినల్ ఆఫీస్, బ్లాక్-5. 1 వ అంతస్తు, హౌస్‌ఫెడ్ కాంప్లెక్స్, బెల్టోలా-బాసిస్తా రోడ్, డిస్పూర్, గౌహతి – 781006 అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాలి.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు ఒకింత భారీ వేతనం లభించనున్న నేపథ్యంలో నిరుద్యోగులకు భారీ స్థాయిలో ప్రయోజనం చేకూరనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహలను వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఆధార్ లో ఉద్యోగం కావడంతో ఈ ఉద్యోగ ఖాళీలకు పోటీ సైతం ఎక్కువగా ఉండే ఛాన్స్ అయితే ఉంది.

ఆధార్ లో జాబ్ సాధిస్తే లైఫ్ కూడా సెక్యూర్ గా ఉంటుందని చెప్పవచ్చు. ఎక్కువ మొత్తం వేతనం లభిస్తుండటం వల్ల కూడా ఈ ఉద్యోగ ఖాళీలకు ఇతర ఉద్యోగ ఖాళీలతో పోల్చి చూస్తే పోటీ ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు భారీ స్థాయిలో బెన్ఫీట్ కలుగుతుంది.