టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్టులో ఉన్నటువంటి హీరోయిన్లలో నటి అనుష్క ముందు వరుసలో ఉంటారు.సూపర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అనుష్క మొదటి సినిమాతోనే ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు. అనంతరం అరుంధతి, చింతకాయల రవి, విక్రమార్కుడు వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల ద్వారా ప్రేక్షకులను ఎంతగానో సందడి చేసిన ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వరుస అవకాశాలను అందుకొని బిజీ అయ్యారు. ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న అనుష్క బాహుబలి సినిమా తర్వాత ఎలాంటి సినిమాలలో నటించలేదు.
ఈ విధంగా అనుష్క తదుపరి ఎలాంటి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో చాలామంది అనుష్క ఇక సినిమాలలో నటించారని తాను పెళ్లి చేసుకోబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలను సృష్టించారు.అయితే ఈ పెళ్లి వార్తల పై అనుష్క ఏ మాత్రం స్పందించలేదు. ఇదిలా ఉండగా తాజాగా ఈమె తెలంగాణకు చెందిన ఓ ప్రముఖ బంగారు వ్యాపారవేత్తతో వివాహానికి సిద్ధమైందని తనని పెళ్లి చేసుకోవడానికి అనుష్క ఒప్పుకోవడంతో వీరి కుటుంబ సభ్యులు తమ వివాహ పనులలో నిమగ్నమయ్యారని సమాచారం.
ఈ విధంగా అనుష్క వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని తెలుగింటి కోడలు కాబోతుందని తెలియడంతో ప్రభాస్ అనుష్క అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ జంట పలు సినిమాలలో నటించడంతో వీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనేలా ఉన్నారు. వీరిద్దరు పెళ్లి చేసుకుంటే చూడముచ్చటగా ఉంటుందని అభిమానులు భావించారు. అయితే వీరు మాత్రం తమ మధ్య కేవలం స్నేహబంధం మాత్రమే ఉందని చెప్పారు.ఇక అనుష్కకి సంబంధించిన ఈ పెళ్లి వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులలో కాస్త ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.