కొత్తిమీర రసం తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది, శరీరంలోని విషపదార్థాలు తొలగిపోతాయి, మరియు రక్తంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. కొత్తిమీరలో ఉండే ఫైబర్, ఎంజైమ్స్ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, అజీర్ణం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలను తగ్గిస్తాయని చెప్పవచ్చు. కొత్తిమీరలో ఉండే విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.
కొత్తిమీర రసం శరీరంలోని విషపదార్థాలను తొలగించడంలో ఉపయోగపడతాయి. కొత్తిమీర రసం తాగడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుందని చెప్పవచ్చు. కొత్తిమీరలో ఐరన్ పుష్కలంగా ఉండడం వల్ల రక్తహీనత సులువుగా తగ్గుతుంది. కొత్తిమీరలో శోథ నిరోధక లక్షణాలు ఉండటం వల్ల కీళ్ల నొప్పులు, వాపు సులువుగా తగ్గే ఛాన్స్ ఉంటుంది. కొత్తిమీరలో యాంటీ ఫంగల్ మరియు యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉండటం వల్ల చర్మ సంబంధిత సమస్యలు తగ్గుతాయి.
కొత్తిమీర నీటితో కళ్ళను శుభ్రం చేసుకోవడం వల్ల కంటి ఇన్ఫెక్షన్ల నుండి ఉపశమనం లభిస్తుందని చెప్పవచ్చు. కొత్తిమీర నీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల బరువు తగ్గే అవకాశాలు ఉంటాయి. కొత్తిమీర రసం తాగడం వల్ల అవసరమైన విటమిన్లు లభిస్తాయి. ఉదయం సమయంలో కొత్తిమీర రసం తాగితే బరువు తగ్గుతారు. ఇన్ఫెక్షన్లను తగ్గించే విషయంలో సైతం ఇది సహాయపడుతుంది.
రక్తపోటును అదుపులో ఉంచేలా చేయడంలో ఇది సహాయపడుతుంది. కిడ్నీ సమస్యలకు చెక్ పెట్టడంలో కొత్తిమీర రసం తోడ్పడుతుంది. కొత్తిమీర రసంలో నిమ్మరసం కలిపి తాగితే మరిన్ని హెల్త్ బెనిఫిట్స్ లభిస్తాయి. ఈ చిట్కాలు పాటించడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి.