Pawan Kalyan: సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిరంజీవి తమ్ముడుగానే ఈయన ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ తనకంటూ నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్న పవన్ కళ్యాణ్ అనంతరం రాజకీయాలలోకి వచ్చి రాజకీయాలలో కూడా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ నేడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు.
ఇక పవన్ కళ్యాణ్ గురించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. అలాంటి వాటిలో గతంలో పవన్ కళ్యాణ్ మాజీ దివంగత మంత్రి పరిటాల రవితో గొడవ పడటంతో ఆయన ఏకంగా పవన్ కళ్యాణ్ కు గుండు కొట్టించారు అంటూ ఇప్పటికీ పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. దీనిలో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియదు కానీ ప్రత్యర్థులు మాత్రం పవన్ కళ్యాణ్ ఈ విషయంపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూనే ఉన్నారు.
చిరంజీవికి, పరిటాల రవికి ఒక భూమి సమస్య కారణంగా గొడవ చోటు చేసుకోవడంతో పవన్ కళ్యాణ్ ఆ గొడవ మధ్యలోకి వెళ్లి సంచలనం సృష్టించారని.. దాంతోనే పవన్ కళ్యాణ్ కి గుండు కొట్టించారంటూ వార్తలు వచ్చాయి. ఇక ఈ విషయం గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పరిటాల రవి తనయుడు పరిటాల శ్రీరామ్ ఈ విషయం గురించి స్పందించి క్లారిటీ ఇచ్చారు.
పవన్ కళ్యాణ్ కి పరిటాల రవి గుండు కొట్టించారన్న వార్తలను ఆయన కొట్టి పారేశారు. పవన్ కళ్యాణ్ ఒక మంచి నాయకుడు ఆయనకు సొసైటీ పట్ల ఎంతో ప్రేమ ఉంది. ఒక నాయకుడు ఎదిగే క్రమంలో ఇలాంటి పుకార్లు వస్తూనే ఉంటాయి. ఇవి కేవలం ఆరోపణలు మాత్రమే. రాజకీయాలలో ఉన్నప్పుడు ఇలాంటి రూమర్లు రావడం సర్వసాధారణం. ఇలాంటి ఆరోపణలలో నిజం ఉంటే స్పందించాలి కానీ.. నిరాధారమైన ఆరోపణలు చేసినప్పుడు ఎలా స్పందిస్తాం. పవన్ కళ్యాణ్ తో మాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇప్పటికైనా ఈ వార్తలకు పులిస్టాప్ పెట్టేయాలి అంటూ పరిటాల శ్రీరామ్ క్లారిటీ ఇచ్చారు.