AP: ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో ఎంతో మంది వైసీపీ నేతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇలా కూటమి పార్టీకి సంబంధించి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడిన వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన అక్రమంగా అరెస్టులు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. ఇలా పెద్ద ఎత్తున అక్రమ అరెస్టులు జరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ అడ్వకేట్ పొన్నవోలు సుధాకర్ ప్రభుత్వానికి తనదైన శైలిలోనే హెచ్చరికలు జారీ చేశారు.
పల్నాడు జిల్లా వినుకొండలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కార్యాలయంలో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈపూరు మండలం బొమ్మరాజుపల్లెకు చెందిన నాగేశ్వరరావు ప్రభుత్వ పాలనపై వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తే అది నేరం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. అతణ్ని పోలీసులు తీసుకెళ్తే తాను హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసినట్లు తెలిపారు.
గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా నడిచిందని సుధాకర్ రెడ్డి తెలిపారు.రాష్ట్రంలో అధికార పార్టీ వాళ్లు ఇప్పుడు ట్రైలర్ చూపిస్తే.. ఎన్నికల తర్వాత అధికారంలోకి రాగానే వైకాపా నాయకులు వారికి సినిమా చూపిస్తారని హెచ్చరించారు. ఇక పోలీసులు తీరుని కూడా ఈయన తప్పు పట్టారు. అక్రమంగా అరెస్టులు చేసి వైసిపి కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కాయద్దని తెలిపారు.వినుకొండ మండలం ఏనుగుపాలెంలో మహిళ హత్య కేసు ఏడాది దాటినా తేల్చని పోలీసులు తలదించుకోవాలని ఈయన విమర్శలు కురిపించారు. ఇలా కూటమి పార్టీ నేతలకు హెచ్చరిస్తూ పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.