AP: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికలలో భాగంగా పొత్తు పెట్టుకుని మూడు పార్టీలు ఎన్నికలలో పోటీ చేసి అధికారంలోకి వచ్చాయి అయితే తాము ఎప్పటికీ ఇలాగే కలిసి ఉంటామని విడిపోమని పలు సందర్భాలలో పవన్ కళ్యాణ్ తెలియచేశారు. అయితే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడాలని ఎంతోమంది అభిమానులు భావిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్నారు అయితే ఆయన ముఖ్యమంత్రి అయితే చూడాలని జనసైనికులు భావించడమే కాకుండా కచ్చితంగా ముఖ్యమంత్రిని చేసి తీరుతామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఎప్పటికప్పుడు మరో మూడు సార్లు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా కొనసాగాలి అంటూ మాట్లాడుతున్నారు..
గతంలో కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం గురించి పవన్ కళ్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు తాజాగా మరోసారి ఈయన మాట్లాడుతూ మరో మూడు దఫాలుగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఆయన హయాంలో పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. మన భారతదేశానికి నరేంద్ర మోడీ మూడుసార్లు ప్రధానమంత్రి అయ్యాడు.
ఇక చంద్రబాబు నాయుడు కూడా వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రి కావాలని కచ్చితంగా చేసి తీరుతామని పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని -పవన్ అన్నారు. అలాగే అసెంబ్లీ సమావేశాల గురించి మాట్లాడుతూ.. కౌరవ సభని గౌరవ సభగా మార్చి వస్తానని శపదం చేశానని, అలాగే గౌరవ సభగా మార్చి చూపించామని చెప్పారు. ఒక అర్ధవంతమైన శాసన సభలు జరిగాయి. ప్రతి ఒక్క శాసన సభ్యుడు మంచి అవగాహనతో సభలో మాట్లాడారని చంద్రబాబు నాయుడు గురించి పవన్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.