Vishnu: కన్నప్ప సినిమాను ఆది పురుష్ తో పోల్చద్దు అసలు అది రామాయణమే కాదు… మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు!

Vishnu: మంచు విష్ణు త్వరలోనే తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఏప్రిల్ 25వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా మంచు విష్ణు వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

ఈ సినిమా ఇంటర్వ్యూలలో భాగంగా మంచు విష్ణు ఎన్నో విషయాల గురించి మాట్లాడారు. ఈ క్రమంలోనే కన్నప్ప సినిమా గురించి కూడా పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. కన్నప్ప సినిమా మన హిందువులకు సంబంధించినది కానీ ఈ సినిమాని భారత దేశంలో కాకుండా ఎందుకు న్యూజిలాండ్లో తెరికెక్కించారు అంటూ ప్రశ్న వేశారు.

ఈ ప్రశ్నకు మంచు విష్ణు సమాధానం చెబుతూ అసలు రామాయణం మహాభారతం ఎక్కడ జరిగింది అనే విషయాలు స్పష్టంగా తెలియదు. మహాభారతం ని వాళ్లకు అనువైన ప్రాంతాల్లో షూట్ చేసుకున్నారు, విడుదల చేసి హిట్స్ అందుకున్నారు. ఎక్కడ షూటింగ్ చేశాము అనేది ముఖ్యం కాదు, కథని ఎంత అద్భుతంగా తెరకెక్కించాము అనేదే ముఖ్యం. ఇక మా సినిమా న్యూజిలాండ్ లో తీయడానికి కారణం లేకపోలేదు.

అక్కడ అడువులు పచ్చదనం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఒకప్పుడు మన ఇండియాలో ఇలాంటి అడవులు ఉండేవి కానీ ఇప్పుడు ఇలాంటివి లేవు అందుకోసమే తాము న్యూజిలాండ్ లో షూటింగ్ చేయాల్సి వచ్చిందని తెలిపారు. ఇక ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమా కూడా ఇతర దేశాలలో షూటింగ్ జరుపుకొని ఫ్లాప్ అయింది కదా అంటూ ప్రశ్న వేయడంతో అసలు మా కన్నప్ప సినిమాని ఆదిపురుష్ సినిమాతో అసలు పోల్చద్దని తెలిపారు.

ఒకే చోట గ్రీన్ మ్యాట్ వేసి ఆ చిత్రాన్ని తెరకెక్కించారు. అందులోనూ వాళ్ళు తీసింది రామాయణం కాదు, రామాయణం ఇలా ఉంటుంది అని ఊహించి ఆ చిత్రాన్ని తీశారు. అందుకే ఆ సినిమా కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యింది. ఒక సినిమా హిట్ కావాలి అంటే కథ మాత్రమే కీలకమని మిగతా విషయాలు ఎలా ఉన్నా పెద్దగా పట్టించుకోరు కానీ కథ మాత్రం ముఖ్యం అంటూ మంచు విష్ణు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.