సీ.ఎస్.ఐ.ఆర్ సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఆన్ లైన్ విధానం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ నెల 21వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. అర్హత ఉన్న అభ్యర్థులకు ఈ జాబ్ నోటిఫికేశన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. మొత్తం 209 ఉద్యోగాలలో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలు 177 ఉన్నాయి.
జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగ ఖాళీలు 32 ఉండగా ఇంటర్ అర్హతతో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది. విద్యార్హత, టైపింగ్ స్కిల్స్, స్టెనోగ్రఫీ ప్రావీణ్యం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ కు 28 సంవత్సరాలు విద్యార్హత కాగా జూనియర్ స్టెనోగ్రాఫర్ కు 27 సంవత్సరాలుగా వయో పరిమితి ఉంది.
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపులు ఉండనున్నాయి. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 19,900 రూపాయల నుంచి 81,100 రూపాయల వరకు వేతనం లభించనుందని తెలుస్తోంది. రాతపరీక్ష, స్టెనోగ్రఫీ, టైపింగ్ టెస్ట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ఫీజు 500 రూపాయలుగా ఉంది.
ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులు, ఇతర అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.