Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల పరంగా ఎంతో మంచి ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఈయన గతంలో ఎన్నోసార్లు ఓటమిపాలు అయినప్పటికీ ఈసారి మాత్రం అధికారంలోకి రావాలి అన్న గట్టి సంకల్పంతో ఎన్నికల బరిలోకి దిగి పొత్తులో భాగంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలిచారు.
ప్రస్తుతం ఐదు శాఖలకు మంత్రిగాను అలాగే డిప్యూటీ సీఎంగా కూడా పవన్ కళ్యాణ్ బాధ్యతలు తీసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్ కు పొలిటికల్ పరంగా కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఈయనకు సినిమాలలో ఎలాంటి క్రేజ్ అయితే ఉందో అంతకుమించి రాజకీయాలలో కూడా పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఇకపోతే కొంతమంది అభిమానులు సినిమాల పరంగా పవన్ కళ్యాణ్ ని ఇష్టపడుతుంటారు రాజకీయాల విషయానికి వచ్చేసరికి వారి అభిప్రాయం వేరేగా ఉంటుంది.
ఇకపోతే తాజాగా నాని సమర్పణలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన కోర్టు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా మన తెలుగమ్మాయి శ్రీదేవి ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయం అయ్యారు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తాను ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అని తెలిపారు. పొలిటికల్ పరంగా అలాగే సినిమాల పరంగా తాను పవన్ కళ్యాణ్ కి పెద్ద అభిమాని అంటూ ఈమె తెలిపారు.
ఇలా పవన్ కళ్యాణ్ కు అభిమాని అయినప్పటికీ గత ఎన్నికలలో నేను పవన్ కళ్యాణ్ కు మాత్రం ఓటు వేయలేదని తెలిపారు. అందుకు కారణం కూడా లేకపోలేదని అప్పటికి నాకు ఇంకా ఓటు హక్కు రాకపోవడంతో పవన్ కళ్యాణ్ కు ఓటు వేయలేదని, ఇక నాకు తెలిసిన వారందరికీ కూడా జనసేనకు ఓటు వేసి గెలిపించాలని చెప్పినట్టు ఈ సందర్భంగా శ్రీదేవి చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇక ఈమె వ్యాఖ్యలతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.