Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పై ఫైర్ అవుతున్న జనసైనికులు… ఎన్నాళ్లనీ ఈ ఊడిగం అంటూ?

Pawan Kalyan: సినీ నటుడు పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి వచ్చే జనసేన పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. ఇలా 2014వ సంవత్సరంలో ఎన్నికలలో పోటీ చేయకపోయినా తెలుగుదేశం పార్టీ బిజెపికి తన మద్దతు తెలియజేశారు అనంతరం 2019వ సంవత్సరంలో రెండు చోట్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలు అయ్యారు.

రాజకీయ జీవితంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ వచ్చారు అయితే 2024 ఎన్నికలలో ఎలాగైనా అధికారంలోకి రావాలని భావించిన పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ అలాగే బిజెపితో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి వచ్చారు ఇలా పిఠాపురం నియోజకవర్గం నుంచి సుమారు 70 వేల ఓట్ల మెజారిటీతో ఈయన గెలుపొందారు. ఇక కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తూనే మరో ఐదు శాఖలకు మంత్రిగా కొనసాగుతున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే చూడాలని అభిమానులు ఎంతో ఆశపడుతున్నారు. ఈసారి కాకపోయినా వచ్చేసారి అయినా ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ని చూడాలని అభిమానులు భావిస్తున్నారు కానీ ఈయన మాత్రం చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని మరో మూడు సార్లు ఆయన ముఖ్యమంత్రి అయితే ఆయన కింద నేను పని చేస్తానని చెబుతున్నారు.

ఇలా చంద్రబాబు కింద నేను పని చేస్తానని పవన్ కళ్యాణ్ చెప్పిన వ్యాఖ్యలు అభిమానులకు జనసైనికులకు ఏమాత్రం నచ్చడం లేదు తమ నాయకుడిని ముఖ్యమంత్రి స్థానంలో చూడాలని మేము ఆరాటపడుతుంటే ఈయన మాత్రం చంద్రబాబు కింద పని చేస్తానని చెప్పడం భావ్యం కాదని ఎన్నాళ్ళు ఈ ఊడిగం చేస్తారు అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ కు పదవి అంటే వ్యామోహం లేదు అనుకుందాం కానీ మరొకరిని మోస్తాను మీ కింద పని చేస్తాను అని చెప్పడం లాంటివి ఇతర పార్టీల వారు చేస్తున్న జెండా కూలీ విమర్శలకి స్వయంగా పవన్ కళ్యాణ్ నే ప్రధాన కారణం కావడం అనేది ఫ్యాన్స్ కి తల కొట్టేసినట్టు అవుతుందనే చెప్పాలి. మరి పవన్ ఎందుకిలా చేస్తున్నారో అభిమానుల మనోభావాలు అంటే గౌరవం ఉందా లేదా అనేది మాత్రం తనకే తెలియాల్సి ఉంది. పొత్తులో ఉన్నప్పటికీ కనీసం డిమాండ్ చేసుకోలేకపోవడంతో ప్రతిపక్షాల్లో కూడా గట్టి విమర్శలకి తావు ఇచ్చినట్టు అవుతుందని జనసైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.