Muralidhar goud: సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎందుకు చేశానా అనిపిస్తుంది: మురళీధర్ గౌడ్

Muralidhar goud: సినీ నటుడు మురళీధర్ గౌడ్ ఇటీవల వరుస సినిమాలలో నటిస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ పరంగా బిజీ అయ్యారు. ఈయన తన ప్రభుత్వ ఉద్యోగానికి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత సినిమాలలోకి వచ్చారు. ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఏడాదికి మూడు సినిమాల ద్వారా ఈయన ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

ఇటీవల సంక్రాంతి పండుగ పురస్కరించుకొని అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే. ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది. ఇక ఈ సినిమాలో మురళీధర్ మీనాక్షి చౌదరికి తండ్రి పాత్రలో నటించారు.

ఇక ఈయన కూడా తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయనకు సినిమా గురించి ఆసక్తి కరమైన ప్రశ్న ఎదురయింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో నటించడం ఎలా అనిపిస్తుంది అంటూ ప్రశ్న వేశారు ఈ ప్రశ్నకు ఈయన సమాధానం చెబుతూ అసలు ఈ సినిమాలో నేను ఎందుకు నటించానా అంటూ చాలా బాధపడుతున్నానని తెలిపారు.

ఇలా బాధపడటానికి గల కారణమేంటనే ప్రశ్న కూడా ఈయనకు ఎదురయింది ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ ఈ సినిమాలో తాను ఐశ్వర్య రాజేష్ కి నాన్న పాత్రలో నటిస్తాను. ఆమె నన్ను నాన్న నాన్న అంటూ పిలుస్తూ ఉంటుంది అలాగే మీనాక్షి చౌదరి బాబాయ్ అంటూ పిలుస్తుంది. ఇలా ఇద్దరి హీరోయిన్లు నన్ను నాన్న, బాబాయ్ అంటూ పిలవడం నాకు చాలా బాధగా ఉందని అందుకే ఈ సినిమాలో నటించినందుకు నేను ఫీల్ అవుతున్నాను అంటూ ఈయన ఫన్నీగా చెప్పిన ఈ సమాధానం ప్రస్తుతం వైరల్ అవుతుంది.