Gautham: తండ్రికి తగ్గ తనయుడు….. యాక్టింగ్ చించేసిన గౌతమ్….. వీడియో వైరల్!

Gautham: సినీ ఇండస్ట్రీలో కొనసాగి హీరోలు తమ పిల్లలను వారసులుగా ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఉంటారు. ఇక త్వరలోనే కొత్త తరం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అందుకు తగ్గ శిక్షణలు కూడా తీసుకుంటూ ఉన్నారు ఇక త్వరలో రాబోయే వారిలో గౌతమ్ ఘట్టమనేని ఒకరు. కృష్ణ వారసుడిగా మహేష్ బాబు ఇండస్ట్రీ లోకి వచ్చి స్టార్ హీరోగా మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక త్వరలోనే మహేష్ బాబు వారసుడిగా గౌతం కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నారు.

ఇప్పటికే నటన పరంగా గౌతమ్ ఇప్పటికీ శిక్షణ తీసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. అతి త్వరలోనే గౌతమ్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారని తెలుస్తుంది. గౌతమ్ ఘట్టమనేని గత సంవత్సరం (2024) ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్ నుండి తన పాఠశాల విద్యను పూర్తి చేశాడు. ఆ తర్వాత అదే సంవత్సరం న్యూయార్క్ విశ్వవిద్యాలయంలో యాక్టింగ్ కోర్స్లో చేరాడు. ఆ విశ్వవిద్యాలయంలో నాలుగు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ డ్రామా కోర్సును అభ్యసిస్తున్నాడు.

ఇలా నటనలో శిక్షణ తీసుకుంటున్నటువంటి గౌతమ్ యాక్ట్ చేసిన ఓ వీడియో గ్లింప్స్ బయటికి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో గౌతమ్ ఎంతో అద్భుతంగా నటించారని అభిమానులు తెగ సంబరపడుతున్నారు. గౌతమ్ తన బ్యాచ్‌మేట్‌లలోని ఒక అమ్మాయితో కలిసి స్కిట్ ప్రదర్శిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇందులో ఓ కామెడీకి సంబంధించిన స్కిట్లో గౌతమ్ ఇచ్చే హావభావాలు ఆకట్టుకుంటున్నాయి. ఎలాంటి డైలాగ్స్ లేకుండా గౌతమ్ ఇచ్చిన ఎక్సప్రెషన్స్, యాక్షన్, ఎమోషన్ అదిరిపోయాయి. ఇలా ఈ వీడియో ద్వారా నటనపరంగా గౌతమ్ కు ఎలాంటి డెడికేషన్ ఉందొ అంటూ అభిమానులు ఈ వీడియోని మరింత వైరల్ చేస్తున్నారు.