Nara Lokesh: ఎన్టీఆర్ ఫ్లెక్సీ చేత పట్టిన నారా లోకేష్… సంతోషంలో తేలిపోతున్న అభిమానులు!

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ విద్య శాఖ మంత్రి నారా లోకేష్ విషయంలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీలోకి కీలకనేతగా వ్యవహరిస్తున్నటువంటి ఈయన ప్రస్తుతం మంత్రిగా కూడా బాధ్యతలు తీసుకుంటూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇక నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీకి నందమూరి వారసుడైన ఎన్టీఆర్ కాస్త దూరంగా ఉన్నారని చెప్పాలి.

కొన్ని కారణాల వల్ల చంద్రబాబునాయుడు బాలకృష్ణ ఎన్టీఆర్ ను తెలుగుదేశం పార్టీకి పూర్తిగా దూరం పెట్టారని తెలుస్తుంది. లోకేష్ రాజకీయ ఎదుగుదల కోసమే జూనియర్ ఎన్టీఆర్ ను పూర్తిగా పక్కన పెట్టేసారు అంటూ వార్తలు కూడా వినిపించాయి. ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా రాజకీయ అంశాలకు సంబంధించి ఏ విషయాల గురించి కూడా మాట్లాడరు. ఇక ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో కూడా ఎక్కడ ఎన్టీఆర్ పేరును కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఉపయోగించుకోలేదు.

ఇక బాలకృష్ణ అయితే ఎన్టీఆర్ ను పూర్తిగా దూరం పెట్టారు. చివరికి ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఉన్నా కూడా ఆయన తొలగించేస్తూ ఉన్నారు. తాజాగా నారా లోకేష్ విషయంలో ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. ఇటీవల నారా లోకేష్ కృష్ణాజిల్లా మల్లవల్లి ఇండస్ట్రీయల్ పార్కులో ‘అశోక్ లేలాండ్ ప్లాంట్‌’ను ప్రారంభించారు. ఇందుకోసం అభిమానులు పెద్ద ఎత్తున ఆయనకు ఘన స్వాగతం పలికారు.

ఈ క్రమంలోనే కొంతమంది పార్టీ కార్యకర్తలు ఎన్టీఆర్ ఫ్లెక్సీలతో సందడి చేశారు ఈ క్రమంలోనే నారా లోకేష్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ ని చేత పట్టుకొని సందడి చేయడంతో ఒకసారిగా అక్కడున్న అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇలా నారా లోకేష్ ఏకంగా ఎన్టీఆర్ ఫ్లెక్సీ పట్టుకోవడంతో అభిమానులు సంతోషంలో ఉన్నారు.