Manchu Vishnu: ప్రభాస్ చాలా వీక్ గా ఉంటాడు… నాలో సగం కూడా లేదు: మంచు విష్ణు

Manchu Vishnu: మంచు విష్ణ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. సుమారు 200 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా మోహన్ బాబు నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమా ఏప్రిల్ 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు విష్ణు సినిమా గురించి వచ్చే ట్రోలింగ్స్ పై స్పందించారు.

ఇకపోతే తాజాగా మంచు విష్ణు ప్రభాస్ గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఈ సినిమాలో ప్రభాస్ కూడా రుద్ర అనే పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదల చేసిన టీజర్ లో ప్రభాస్ మూడు సెకండ్ల లుక్ టీజర్ కే హైలెట్ అని చెప్పాలి. అయితే ఈ సినిమాలో రుద్ర పాత్రలో నటించిన ప్రభాస్ గురించి తాజాగా మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

కన్నప్ప సినిమాలో ప్రభాస్ కి స్లీవ్ లెస్ డ్రెస్ వేద్దామని చూశారట. తను చాలా బక్కగా ఉండడం నాలాంటి ఫిజిక్ ను మెయింటైన్ చేయలేకపోవడం వల్లే స్లీవ్ లెస్ కాకుండా ఫుల్ లెంత్ డ్రెస్ వేశామని నాలో సగం మాత్రమే ప్రభాస్ ఉన్నారని తెలిపారు. పాన్ ఇండియా స్టార్ హీరో అయినటువంటి ప్రభాస్ గురించి మంచు విష్ణు ఇలా కాస్త తక్కువ చేసి మాట్లాడటంతో ప్రభాస్ అభిమానులు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.

నిజానికి బాహుబలి సినిమాలో ప్రభాస్ చాలా దిట్టంగా ఉంటాడు. ఆయనతో పోలిస్తే మంచు విష్ణు ఎందుకు పనికిరాడు. కానీ మధ్యలో ప్రభాస్ కి కొన్ని హెల్తీ ఇష్యుస్ రావడం వల్ల ఆయన ఎక్కువగా బాడీని మెయింటైన్ చేయలేకపోతున్నాడు. కానీ మంచు విష్ణు కంటే ప్రభాస్ బాగుంటారు అంటూ అభిమానులు మంచు విష్ణు పై తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిపిస్తున్నారు.