Venu Swamy: సమంతతో పాటు ఆ ఇద్దరు హీరోలు సూసైడ్ … మరోసారి సంచలనం రేపిన వేణు స్వామి!

Venu Swamy: వేణు స్వామి పరిచయం అవసరం లేని పేరు జ్యోతిష్యులుగా ఎంతో ఫేమస్ అయినటువంటి ఈయన మొదట్లో చెప్పిన జాతకాలు కాస్త నిజం కావడంతో ఈయనని అనుసరించే వారి సంఖ్య పెరిగిపోయింది. ఇలా వేణు స్వామి జాతకాలు కొంతమేర నిజం కావడంతో ఎంతోమంది సినిమా సెలబ్రిటీలు కూడా ఈయన వద్ద జ్యోతిష్యం చెప్పించుకోవడం ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వటం కోసం పూజలు చేయించుకోవడం వంటివి జరిగాయి.

ఈ విధంగా వేణు స్వామి జాతకాల ద్వారా ఎంతో ఫేమస్ కావడంతో ఈయన తరచూ సినిమా సెలబ్రిటీలకు సంబంధించిన జాతకాలు చెబుతూ వార్తల్లో నిలుస్తున్నారు. అయితే కొన్నిసార్లు ఈయన చెప్పే జాతకం అభిమానులకు పట్టరాని ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. ఇలా తరచూ సెలబ్రెటీల గురించి ఈయన మాట్లాడుతున్న తీరుపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఈయనపై పోలీస్ కేసులు కూడా నమోదు అయ్యాయి కానీ ఈయన తీరు మాత్రం మారలేదు.

తాజాగా ఈయనకు సంబంధించిన ఒక ఆడియో లీక్ అవ్వడం జరిగింది. అయితే ఇందులో భాగంగా వేణు స్వామి సమంత విజయ్ దేవరకొండ ప్రభాస్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకంగా వారు సూసైడ్ చేసుకొని చనిపోతారు అంటూ ఈయన చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపుతున్నాయి. సమంత సూసైడ్ చేసుకుంటుందని ఇక ప్రభాస్ విజయ్ దేవరకొండ ఇద్దరిలో ఎవరో ఒకరు సూసైడ్ చేసుకుంటారని ఈయన తెలిపారు .

ఇద్దరి హీరోల జాతకం ప్రకారం చూస్తే విజయ్ దేవరకొండ సూసైడ్ చేసుకొని చనిపోవడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. అయితే ఈ విషయాలు మీడియాకి కూడా తెలుసని కాకపోతే బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారని వేణుస్వామి తెలిపారు. ఇక ప్రభాస్ కు శరీరం మొత్తం గాయాలు ఉన్నాయి కానీ ఆయన బయటకు పెట్టుకోలేదని తెలిపారు. ఇలా గాయాలు పాలు కావడంతోనే ఆయన నటిస్తున్న రాజా సాబ్ సినిమా తరచు వాయిదా పడుతూ వస్తుంది అంటూ వేణు స్వామి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.