Sobhita: శోభిత దుస్తులపై భారీ ట్రోల్స్….ఇది కూడా సమంతను చూసే కాపీ కొట్టింది అంటూ!

Sobhita: శోభిత దూళిపాళ్ల ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వార్తలను నిలుస్తున్నారు. ఈమె ఎప్పుడైతే నటుడు నాగచైతన్యతో ప్రేమలో ఉన్నారనే విషయాన్ని తెలియజేశారో అప్పటినుంచి శోభితకు సంబంధించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఇకపోతే కొద్ది రోజులుగా నాగచైతన్య శోభితకు సంబంధించిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఇటీవల నాగచైతన్య శోభిత ఇద్దరు కూడా ప్రముఖ మ్యాగిజైన్ “వోగ్” కవర్ ఫొటోస్ కి ఫోజులిచ్చారు. ఇందులో నాగచైతన్య, శోభిత మంచి స్టైలిష్ దుస్తులలో కనిపించారు. ఇక ఈ ఫోటో షూట్ లో భాగంగా శోభిత ధరించిన దుస్తులు పెద్ద ఎత్తున విమర్శలకు కారణం అవుతున్నాయి. ఈమె ఈ దుస్తులను సమంతను చూసి కాపీ కొట్టారు అంటూ విమర్శలు చేస్తున్నారు.

ఇక ఈ విషయంపై ఒక నెటిజన్ ఏకంగా కామెంట్ చేస్తూ..శోభిత గతంలో సమంత ధరించిన దుస్తులను ధరించి కాపీ కొట్టిందని కామెంట్ చేశాడు. నిజానికి శోభిత ఈ మ్యాగజైన్ కోసం అఖ్ల్ బ్రాండ్ కి చెందిన సిల్వర్ కలర్ టాసెల్-డిటెయిలింగ్ స్లిప్ డ్రెస్ ధరించింది. దీని ధర దాదాపుగా రూ. 49,593 పైగా ఉన్నట్టు తెలుస్తోంది అయితే సమంత కూడా గతంలో ఇలాంటి డ్రెస్ ధరించడం విశేషం.

గతంలో సమంత ఓంబ్రే-హ్యూడ్ టాసెల్డ్ స్కర్ట్ ని ధరించి ఫోటోలై ఫోజులిచ్చింది. దీంతో వీరిద్దరూ ధరించిన దుస్తులు ఒకేలా ఉన్నాయని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.. ఇక శోభిత ఈ విషయంలో మాత్రమే కాదు గతంలో సమంతను అనుసరిస్తూ ఈమె కొన్ని వీడియోలను కూడా పోస్ట్ చేశారు. దీంతో శోభిత సమంత కాపీ కొడుతూ ఉన్నారంటూ అభిమానులు విమర్శలు కురిపిస్తున్నారు.

ఇక సమంతకు నాగచైతన్య విడాకులు జరిగిన తర్వాత నాగచైతన్య శోభిత ప్రేమలో పడ్డారు. ఇలా రహస్యంగా వీరి ప్రేమ ప్రయాణం కొనసాగిస్తూ ఇటీవల నిశ్చితార్థ సమయంలో తమ నిశ్చితార్థం గురించి ప్రేమ విషయాన్ని బయట పెట్టారు. అనంతరం గత ఏడాది డిసెంబర్ నెలలో కొద్దిమంది సెలబ్రిటీలు కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం జరుపుకున్న సంగతి తెలిసిందే.