Tollywood: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ లో వచ్చే సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవుతూ ఉంటాయి. అలాగే కొన్ని కాంబినేషన్లు డిజాస్టర్ కాంబినేషన్లు కూడా ఉంటాయి. వారి కాంబినేషన్లో ఎన్నో అంచనాల మీద సినిమా విడుదల అయినప్పటికీ సినిమా మాత్రం డిజాస్టర్ గానే మిగిలిపోతుంది. మరి అలాంటి కాంబినేషన్స్ ఏంటి అనే విషయానికి వస్తే…
పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్న ప్రభాస్ తన పెదనాన్న కృష్ణంరాజు గారితో కలిసి సినిమా చేశారు అంటే ఆ సినిమా డిజాస్టర్ అయినట్టే. ప్రభాస్ కృష్ణంరాజు కలిసి రెబల్, రాధే శ్యామ్ అనే సినిమాలలో నటించారు. ఈ రెండు సినిమాలు కూడా ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్నాయి.
ఇక ఎన్టీఆర్ మెహర్ రమేష్ వీరిద్దరి కాంబోలో సినిమా వచ్చినా కూడా అది డిజాస్టర్ గానే మిగులుతుంది. డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ముందుగా కంత్రి సినిమా చేశారు. ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది అయితే మరోసారి శక్తి సినిమాలో ఎన్టీఆర్ అవకాశం ఇచ్చారు ఈ సినిమా ఘోర డిజాస్టర్ కావటం గమనార్హం.
ఇక రామ్ చరణ్ ఇటీవల నటి కీయారా అద్వానీ కలిసిన నటించిన చిత్రం గేమ్ చేంజర్. పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పరాజయం పాలయ్యింది. అయితే ఇది వరకే వీరి కాంబినేషన్లో వినయ విధేయ రామ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సక్సెస్ అందుకోలేకపోయింది.
ఇలా వీరి కాంబినేషన్లో సినిమా వస్తే డిజాస్టర్ గానే మిగిలిపోతుంది అలాగే శ్రీను వైట్ల, దర్శకత్వంలో మెగా హీరోలు సినిమాలు చేసిన కూడ ఆ సినిమాలు కూడా డిజాస్టర్ సినిమాలు గానీ మిగిలిపోతాయని చెప్పాలి.