శనీశ్వరుడు 100 రెట్ల యోగాన్ని, ఐశ్వర్యాన్ని ఇస్తారా.. ఈ పనులు చేస్తే చాలంటూ?

మనలో చాలామంది శనిదేవుడు వల్ల చెడు జరుగుతుందని ఫీలవుతారనే సంగతి తెలిసిందే. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని పేర్లను వింటే మనలో చాలామంది కంగారు పడతారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే శనీశ్వరుడి గురించి కొన్ని విషయాలను తెలుసుకుంటే మాత్రం మనలో ఈ భయం పోయే అవకాశాలు అయితే ఉంటాయి. శనీశ్వరుడిని పూజించడం ద్వారా కూడా మంచి ఫలితాలను పొందవచ్చు.

వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ప్రతి సంవత్సరం శనిని ఆరాధించే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అయితే ఎవరి ఇంట్లో కూడా శని విగ్రహం ఉండదనే సంగతి తెలిసిందే. శనిదేవునికి ఉన్న శాపం వల్ల విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవడానికి ఎవరూ ఆసక్తి చూపించరు. శనీశ్వరుడిని శని అని పిలవడానికి బదులుగా శనీశ్వరా అని పిలవడం వల్ల శుభ ఫలితాలు కలిగే ఛాన్స్ అయితే ఉంటుంది.

ఈ శబ్దంతో పిలవడం వల్ల శనీశ్వరుడు శివుడు, వేంకటేశ్వర స్వామిలా కోరిన కోరికలు తీరుస్తాడని చాలామంది ఫీలవుతారు. నవగ్రహ మండపానికి వెళ్లిన సమయంలో భక్తితో శనీశ్వరుడిని పూజించడం ద్వారా అనుకూల ఫలితాలను పొందవచ్చు. శనివార నియయాలను పాటించే వాళ్లపై శనీశ్వరుని అనుగ్రహం ఉంటుంది. నీలం లేదా నలుపు రంగు వస్త్రాల్ని ధరించడం వల్ల శుభ ఫలితాలు కలిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

చిమ్మిలి నివేదనం చేయడం వల్ల, శివారాధన చేయడం వల్ల, కూడా శుభ ఫలితాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. శనీశ్వరుని వల్ల దోషాలు కలిగితే మాత్రం యోగంతో పాటు పీడను కలిగిస్తుంది. శనీశ్వరుడిని భక్తిగా పూజించే వాళ్లకు మాత్రం ఆయన అనుగ్రహం ఉంటుంది. శనీశ్వరుడు కొద్దిగా పీడించినా వందరెట్లు యోగాన్ని, ఐశ్వర్యాన్నీ అందిస్తారు. అందువల్ల శనీశ్వరుడిని పూజిస్తే శుభ ఫలితాలు కలిగే అవకాశాలు అయితే ఉంటాయి.