Revanth Reddy: కుమారి ఆంటీ పూజ గదిలో రేవంత్ రెడ్డి ఫోటో…. ఏకంగా దేవున్ని చేసేసిందిగా?

Revanth Reddy: కుమారి ఆంటీ పరిచయం అవసరం లేని పేరు. ఈమె హైదరాబాదులో రోడ్డు పక్కన ఒక ఫుడ్ స్టాల్ పెట్టుకొని ఎంతోమంది ఆకలి తీర్చడమే కాకుండా ఆ డబ్బుతో తన కడుపు నింపుకుంటూ వచ్చారు.. అయితే ఈమె దగ్గర తక్కువ ధరకే వివిధ రకాల ఆహార పదార్థాలను అందరికీ అందిస్తున్న నేపథ్యంలో ఎంతో మంది యూట్యూబ్ ఛానల్ వారు ఆమె దగ్గరకు వెళ్లి ఇంటర్వ్యూలు తీసుకుంటూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా కుమారి ఆంటీ ఫేమస్ అయ్యారు.

ఇలా కుమారి ఆంటీ ఫేమస్ అవడంతో ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎంతో మంది ఇక్కడికి వచ్చి భోజనం చేసేవారు తద్వారా పూర్తిగా ట్రాఫిక్ జాబ్ కావడంతో పోలీసులు ఆమె ఫుడ్ స్టాల్ తీసేయించారు. ఇలా ఫుడ్ స్టాల్ తీసేయించడంతో తన పొట్ట కొట్టారని ఎంతో ఆవేదన వ్యక్తం చేసిన కుమారి ఆంటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండగా నిలిచారు. దీంతో రేవంత్ రెడ్డిని దేవుడిగా భావించిన కుమారి ఆంటీ ఏకంగా ఆయన ఫోటోని తన పూజ మందిరంలో పెట్టుకొని పూజిస్తూ ఉన్నారు.

తాజాగా ఈమె తన పూజ మందిరానికి సంబంధించి ఒక వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇది కాస్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. అయితే ఆపద సమయంలో తనకు అండగా నిలిచి తనకు జీవనోపాధిని కల్పించిన రేవంత్ రెడ్డి నిజంగానే తనకు దేవుడితో సమానం అని భావించిన ఈమె దేవుళ్ళతో పాటు ఆయన ఫోటోని కూడా పెట్టి పూజిస్తున్నారు. ఇక ఈ వీడియో వైరల్ గా మారడంతో ఎంతోమంది నేటిజన్స్ విభిన్న రకాలుగా స్పందిస్తున్నారు.

ఇక కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ బిజినెస్ ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్నారు. గతంలో తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ కు పెద్ద ఎత్తున వరదలు వచ్చిన నేపథ్యంలో ఈమె రెండు తెలుగు రాష్ట్రాలకు 50వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయాన్ని కూడా అందించిన సంగతి తెలిసిందే.