Lavanya Tripati: సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో లావణ్య త్రిపాఠి ఒకరు. ఈమె అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ఇకపోతే ఈమె పలు సినిమాలలో నటిస్తూనే మెగా హీరో వరుణ్ తేజ్ తో ప్రేమలో పడ్డారు.
ఇలా కొంతకాలం పాటు ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట 2023 నవంబర్ నెలలో ఇటలీలో వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇలా పెళ్లి తర్వాత లావణ్య మెగా ఇంటి కోడలుగా అడుగుపెట్టి సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇలా పెళ్లి తర్వాత ఈమె ఒక సినిమాని కూడా ప్రకటించకపోవడంతో బహుశా సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారేమోనని అందరూ భావించారు.
ఇలా ఇన్ని రోజులపాటు సినిమాలకు దూరంగా ఉన్న లావణ్య త్రిపాఠి తాజాగా ఓ కొత్త సినిమాని ప్రకటించారు. ఈ క్రమంలోనే తన కొత్త సినిమా పూజ కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి లావణ్య కొత్త సినిమా వివరాలు ఏంటి ఇందులో హీరోగా ఎవరు నటించబోతున్నారు అనే విషయానికి వస్తే…
భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్ఎంఎస్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు తాతనేని సత్య దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి, మలయాళ నటుడు దేవ్ మోహన్ ప్రధాన పాత్రలలో నటించబోతున్నారు. ఈ చిత్రానికి ‘సతీ లీలావతి’ అనే టైటిల్ ను కూడా ప్రకటించారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో లావణ్య త్రిపాఠి భర్త వరుణ్ తేజ్ కూడా పాల్గొన్నారు.