Nani: నాచురల్ స్టార్ నానితో బ్రహ్మముడి కావ్య… అన్నా అంటూ సరికొత్త వీడియో!

Nani: బ్రహ్మ ముడి కావ్య అంటే గుర్తుపట్టని వారు ఎవరు ఉండరు. ఈ సీరియల్లో కావ్య పాత్రలో ఎంతో అద్భుతంగా నటిస్తున్నటువంటి నటి దీపికా రంగరాజు ఇటీవల పెద్ద ఎత్తున బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేస్తూ ఉన్నారు.. ప్రస్తుతం ఈమె పలు బుల్లి కార్యక్రమాలతో పాటు పలు యాడ్స్ కూడా చేస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.

ఇకపోతే దీపికా రంగరాజు తాజాగా నేచురల్ స్టార్ నానితో కలిసి మరొక యాడ్ లో సందడి చేశారు. తాజాగా ఎందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేవిధంగా ఈ ఫోటోలను కూడా దీపిక రంగరాజు సోషల్ మీడియాలో షేర్ చేశారు..

ఆశీర్వాద్ బ్రాండ్ ప్రమోట్ చేస్తూ వీరిద్దరూ యాడ్ షూట్ చేశారు. ఈ యాడ్ కి సంబంధించిన ఫోటోలతో పాటు వీడియోని కావ్య సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడమే కాకుండా నాని గొప్పతనం గురించి కూడా తెలిపారు..నాని గారు చాలా హంబుల్ అండ్ సింపుల్ పర్సన్. ఆయనతో యాడ్ చేయడం చాలా సంతోషంగా ఉంది అంటూ చెప్పుకు వచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి.

ఇదిలా ఉండగా నాని సైతం ఇటీవల కాలంలో వరుసగా సినిమాలు చేయడమే కాకుండా సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ బిజీగా ఉన్నారు. మరోవైపు వరుస బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ భారీగా సంపాదిస్తున్నారు. ఇటీవల కోర్ట్ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన నాని ఈ సినిమా ద్వారా భారీ స్థాయిలో లాభాలను అందుకున్నారు. ఇక త్వరలోనే హిట్ 3, ప్యారడైజ్ వంటి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.