Alekhya Pickles: అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదం రోజురోజుకు ముదురుతోంది గత నాలుగు రోజుల క్రితం ఒక కస్టమర్ మీ పికిల్స్ ధరలు ఎక్కువగా ఉన్నాయి అన్నందుకు అలేఖ్య కాస్త బూతులు మాట్లాడుతూ ఒక వాయిస్ మెసేజ్ పెట్టారు అయితే ఆ కస్టమర్ ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా వీరి వ్యవహారం తలకిందులుగా మారిపోయింది.
సోషల్ మీడియాలో అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్ గురించి పెద్ద ఎత్తున విమర్శలు రావడం మొదలయ్యాయి. ఇలా వారి గురించి వస్తున్న విమర్శలను చూసి తట్టుకోలేక చివరికి క్షమాపణలు చెబుతూ వీడియోలను విడుదల చేశారు అంతేకాకుండా పచ్చల బిజినెస్ కూడా క్లోజ్ చేశారు అయినప్పటికీ వీరి గురించి వస్తున్న విమర్శలు మాత్రం ఆగడం లేదు.
ఇక చివరికి అలేఖ్య తన గురించి వస్తున్న విమర్శలపై మానసికంగా ఆందోళన చెందుతూ హాస్పిటల్ పాలయ్యారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయినా వీరి గురించి ట్రోల్స్ మాత్రం ఆగకపోవడంతో నటి మాధవి లత సైతం ఈ వ్యవహారం పై స్పందించారు. తాజాగా ఆమె అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యవహారంలో నేటిజన్స్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందింది దీంతో చైనావాడు జపాన్ వాడు ఏవేవో కనిపెడుతున్నారు కానీ మనం మాత్రం పచ్చళ్ళ పాప గురించి మాట్లాడుతున్నాము. ఏదైనా పనికొచ్చే పని చేయమంటే ఇలా పచ్చళ్ళ పాపల వెంట పడటం ఏంటి అంటూ నేటిజన్ల తీరును ఈమె తప్పు పడుతూ ఆ గ్రహం వ్యక్తం చేశారు. ఇలా వారు చేసిన తప్పును ఒప్పుకొని క్షమాపణలు చెప్పినప్పటికీ వారి గురించి సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఆగకపోవడంతో మాధవి లత సైతం ఘాటుగా రియాక్ట్ అయ్యారు.
