Y.S.Jagan: వడ్డీతో సహా చెల్లిస్తా… పోలీసులకు ఊర మాస్ వార్నింగ్ ఇచ్చిన జగన్!

Y.S. Jagan: మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి గ్రామానికి వచ్చిన విషయం తెలిసిందే. పాపిరెడ్డిపల్లికి చెందిన కురుబ లింగమయ్య అనే వ్యక్తి పరిటాల వర్గీయుల చేతుల దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ క్రమంలోనే బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించడం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు పాపిరెడ్డిపల్లికి చేరుకున్నారు..

ఇలా లింగమయ్య చిత్రపటానికి నివాళులు అర్పించిన అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి భరోసా కల్పించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడుకు వాచ్మెన్ గా పనిచేస్తున్నారంటూ కొంతమంది పోలీసులను ఉద్దేశించి మాట్లాడారు.

ఎల్లకాలం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉండదు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే చంద్రబాబుకు తొత్తులుగా మారారో వారి బట్టలు ఊడదీసి రోడ్డుపై నిలబెడతాను యూనిఫామ్ తీసేస్తా.. మీరు చేసిన ప్రతి పనికి వడ్డీతో సహా తిరిగి చెల్లించి దోషులుగా నిలబెడతాను అంటూ జగన్ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం గురించి విమర్శలు కురిపించారు.

కూటమి ప్రభుత్వం కేవలం వైసిపి వారిని టార్గెట్ చేస్తూ అక్రమంగా అరెస్టులు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇప్పటికే పోసాని కృష్ణ మురళి, వల్లభనేని వంశీ, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నందిగం సురేష్ వంటి వారందరిని కక్ష సాధింపు చర్యలలో భాగంగానే అక్రమంగా అరెస్టులు చేసి జైలుకు పంపించారని జగన్ కూటమి తీరుపై విమర్శలు కురిపించారు. ఇలా పోలీస్ వ్యవస్థకు జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇస్తూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.