Anasuya: బుల్లితెర యాంకర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో అనసూయ భరద్వాజ్ ఒకరు. ఇలా పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తున్న ఈమె ప్రస్తుతం సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇటీవల వరుస సినిమాల ద్వారా ఎంతో బిజీగా ఉన్నా అనసూయ బుల్లితెర కార్యక్రమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారనే చెప్పాలి.
ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇకపోతే శ్రీరామనవమి పండుగ సందర్భంగా అనసూయ తన భర్తతో కలిసి ఫోటోషూట్ నిర్వహించారు.
ఈ ఫోటోషూట్ లో భాగంగా ఈమె చాలా చక్కగా చీర కట్టుకొని నగలు పెట్టుకొని ఫోటోలకు ఫోజులిచ్చారు అయితే మెడలో తాళి వేసుకోవడం మాత్రం మరిచిపోయారు. దీంతో పెద్ద ఎత్తున విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇకపోతే అనసూయ ఈ ఫోటోలను షేర్ చేస్తూ నా రాముడితో నేను అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఇక ఈ ఫోటోలు పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
నీ భర్త రాముడు కావచ్చు కానీ నువ్వు మాత్రం సీతవు కాదు… శూర్పణఖ అంటూ నేటిజన్ల కామెంట్లు చేస్తున్నారు. అదేవిధంగా మరికొంతమంది ఎంతో అందంగా రెడీ అయ్యావు మెడలో తాళి లేదా అనే విషయాన్ని కూడా చూసుకోవాలి కదా అంటూ అనసూయ పై విమర్శలు చేస్తున్నారు. ఇక ఈమె సినిమాల విషయానికొస్తే ఇటీవల పుష్ప2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్అందుకున్నారు.
